Begin typing your search above and press return to search.

కారులో కృష్ణార్జునులు... కేటీఆర్-హరీశ్ వీడియో వైరల్!

ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ – హరీశ్ రావులు ఒకేకారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేటీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కన కూర్చుని ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 11:28 AM GMT
కారులో కృష్ణార్జునులు... కేటీఆర్-హరీశ్  వీడియో వైరల్!
X

తెలంగాణలో బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కు రెండు భుజాలుగా అటు హరీశ్ రావు, ఇటు కేటీఆర్ ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు 39 స్థానాలకు పరిమితమైన బీఆరెస్స్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో అన్నీ వీరిద్దరై చూసుకుంటున్నారు.. పార్టీ బాధ్యతలను పంచుకుంటూ నిర్వర్తిస్తున్నారని అంటున్నారు. దీంతో వీరిని కృష్ణార్జునులు అని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

అవును... ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆరెస్స్ ఓటమి తర్వాత.. ఆ పార్టీని నడిపించే బాధ్యతను హరీశ్, కేటీఆర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో... వీరిద్దరూ అన్నీ తామై పార్టీని నడిపిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్యా రాజకీయంగా కోల్డ్ వార్ నడుస్తుంటుందని.. "ఆఫ్టర్ కేసీఆర్?" అనే ప్రశ్నకు సమాధానం తానవ్వాలంటే తానవ్వాలనే అంతర్యుద్ధం వీరిద్దరిమధ్యా నడుస్తుంటుందని ప్రత్యర్థులు చెబుతుంటారు!

అయితే ఈ విమర్శలను వీరిద్ధరూ నిత్యం తిప్పికొడుతూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ – హరీశ్ రావులు ఒకేకారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేటీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కన కూర్చుని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో... ఈ ఫోటోల కింద కామెంట్లతో చెలరేగిపోతున్నారు వీరి ఫ్యాన్స్. వీరిద్దరినీ కృష్ణార్జునులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ విషయాలను ట్వీట్ చేసిన హరీశ్ రావు... బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం జరగనున్న "ఎట్ హోం" కార్యక్రమానికి కేటీఅర్ తో కలిసి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇలా బీఆరెస్స్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్.. తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కారు నడుపుతుండగా.. హరీశ్ ఆయన పక్కనే కూర్చున్నారు.