ఫేక్ వీడియో ఇలా కూడా చేస్తారా... కేటీఆర్ కి మైండ్ బ్లాక్ అయ్యింది!
ఇక ఎన్నికల సీజన్ కావడంతో తెలంగాణలో ఇలాంటి ఫేక్ వేడీయో ఒకటి హల్ చల్ చేస్తుంది.
By: Tupaki Desk | 30 Nov 2023 7:16 AM GMTఇటీవల కాలంలో డీప్ ఫేక్ లు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రెటీలకు సంబంధించిన ఫేక్ వీడియోలపై కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. వాటి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ఇక ఎన్నికల సీజన్ కావడంతో తెలంగాణలో ఇలాంటి ఫేక్ వేడీయో ఒకటి హల్ చల్ చేస్తుంది.
అవును... నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం నుంచి పోలింగ్ చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతుంది. ఆ సంగతి అలా ఉంటే... తనపై విడుదలైన ఒక ఫేక్ వీడియోపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
తాజాగా కేటీఆర్ కి సంబంధించిన ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలు ప్రసంగిస్తున్న కేటీఆర్... "కేసీఆర్ ని ఓడించడమే నా జీవిత లక్ష్యం... అందుకే నేను తప్పుకుంటున్నా.. కాంగ్రెస్ కే గుద్దండి అందరూ కలిసి" అని అన్నారు. దీంతో ఈ వీడియో చర్చనీయాంశం అయ్యింది. ఈ వీడియోని తన ఇస్టాలో పోస్ట్ చేసిన కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇందులో భాగంగా... "ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నాడు మరో ఫేక్ వీడియో ప్రచారం మొదలుపెట్టారు. డిసెంబర్ మూడవ తారీకు దాకా అగాల్సిన పనిలేదు. వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న మీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ పై ఈ చిల్లర డీప్ ఫేక్ వీడియో వేసినప్పుడే మీ ఓటమి ఖాయం అయ్యింది. మీరు ఎంత గింజుకున్నా కేసీఆర్ విజయాన్ని ఆపలేరు" అని పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో ఆ ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ ను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. అందులో... "ఒక బక్క పలచని కేసీఆర్. ఆయన ఉన్నదే 52, 53 కిలోలు. ఆయనను కొట్టేటందుకు అందరూ ఒకటవుతున్నారు. నిన్న షర్మిళ గారు ప్రకటించారు. కేసీఆర్ ని ఓడించడమే నా జీవిత లక్ష్యం... అందుకే నేను తప్పుకుంటున్నా.. కాంగ్రెస్ కే గుద్దండి అందరూ కలిసి" అని అన్నారు!
ఈ వీడియోలో చివరి లైన్స్ ని మాత్రమే ఉంచి... ఈ వీడియోను తయారుచేసినట్లు తెలుస్తుంది. దీనిపై కేటీఆర్ ఇన్ స్టా వేదికగా సీరియస్ అయ్యారు. "మీది ఎంత దౌర్భాగ్యపు పార్టీనో తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది. మీకు చైతన్య వంతులైన తెలంగాణ ఓటర్లు ఓటుతోనే బుద్ధి చెబుతారు" అని స్పందించారు.