Begin typing your search above and press return to search.

కేటీఆర్ మాట‌: బీజేపీ-కాంగ్రెస్ నేత‌లు అందుకే భ‌య‌ప‌డుతున్నార‌ట‌

మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:28 PM GMT
కేటీఆర్ మాట‌: బీజేపీ-కాంగ్రెస్ నేత‌లు అందుకే భ‌య‌ప‌డుతున్నార‌ట‌
X

మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుత తెలంగాణ ఎన్నిక‌ల‌ను జాతీయ పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ లు ఎందుకంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి? ఈ రెండు పార్టీలు ఎందుకంతగా భ‌య‌ప‌డుతున్నా య‌నే విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. వాస్త‌వానికి భ‌యం అనే మాట ఇప్ప‌టి వ‌ర‌కు వినిపించ‌లేదు. కానీ, కేటీఆర్ స‌ర్ చెప్పుకొచ్చారు కాబ‌ట్టి.. ఇప్పుడు అది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కేసీఆర్‌ను చూసి.. కాంగ్రెస్‌, బీజేపీలు భ‌య‌ప‌డుతున్నాయ‌నేది కేటీఆర్ మాట‌. అది కూడా ఆయ‌న ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రి అయితే.. ఆ రెండు పార్టీలు త‌ట్టుకోలేక పోతున్నాయ‌ని కూడా చెప్పారు. దీనికి కార‌ణం.. ఇక్క‌డ తెలంగాణ‌లో కేసీఆర్ మూడోసారి కూడా గెలిస్తే ఇక‌, నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీయేన‌ని.. అక్క‌డ ఆయ‌న జెండా పాతుతారని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయ‌ని.. వాటిలో భ‌యం ప‌ట్టుకుంద‌ని చెప్పుకొచ్చారు.

తాజాగా నల్గొండ జిల్లాలోని దేవరకొండలో నిర్వ‌హించిన బీఆర్ ఎస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్‌.. బీజేపీ కాంగ్రెస్‌ల‌పై విరుచుకుపడ్డారు. "దేవరకొండ అంటే 100 కోట్ల అభివృద్ధి కనపడుతుంది. తొమ్మిదిన్నరేళ్లలో 12 వేల కోట్లతో దేవరకొండని కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు ఎన్ని 11 ఛాన్సులు ఇచ్చినా తెలంగాణలో అభివృద్ధి ఏమీ చేయలేదు. ఢిల్లీ పార్టీ వాళ్లు మామూలు వాళ్లు కాదు దేశముదుర్లు. ఢిల్లీ నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎవ‌రు ఎవ‌రికి భ‌య‌ప‌డుతున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. కేటీఆర్ వ్యాఖ్య‌లు మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి.