Begin typing your search above and press return to search.

జేబులో కత్తెర్లు, లంకె బిందెలు... రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు!

ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డికి బీఆరెస్స్ నేతలతో ఎటువంటి ప్రమాదం లేదని, పక్కనున్న కాంగ్రెస్ నేతలతోనే సమస్య అని అన్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 1:14 PM
జేబులో కత్తెర్లు, లంకె బిందెలు... రేవంత్  పై కేటీఆర్  సెటైర్లు!
X

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతుందనే కామెంట్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బీఆరెస్స్ సమావేశంలో మైకందుకున్న మాజీమంత్రి కేటీఆర్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డికి బీఆరెస్స్ నేతలతో ఎటువంటి ప్రమాదం లేదని, పక్కనున్న కాంగ్రెస్ నేతలతోనే సమస్య అని అన్నారు.

అవును.. తాజాగా జరిగిన బీఆరెస్స్ సమావేశంలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైరయ్యారు. తాను జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా.. పిచ్చిగా మాట్లాడితే గొంతు కోసా.. కడుపు చించుతా.. పేగులు మెడలో వేసుకుని తిరుగుతా.. మా ప్రభుత్వం జోలికొస్తే మానవ బాంబులవు అవుతాం అని రేవంత్ రెడ్డి అంటున్నారని మొదలుపెట్టిన కేటీఆర్... జేబులో కత్తెర పెట్టుకుని జేబు దొంగలు తిరుగారని.. అయితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా జేబులో కెత్తెరలు పెట్టుకుని తిరగడం ఏమిటో అర్ధం కావడం లేదని విమర్శించారు.

ఇదే క్రమంలో గతంలోనూ ఒకసారి సెక్రటేరియట్ గురించి మాట్లాడుతూ... ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను కానీ, అన్నీ ఖాళీ బిందెలే ఉన్నాయంటూ రేవంత్ అన్నారని తెలిపిన కేటీఆర్... గునపాలు, గంపలు పట్టుకుని.. నెత్తిపై ముసుగు కప్పుని లంకె బిందెల కోసం ఎవరు తిరుతారు అని ప్రశ్నించారు! అసలు ఈ లంకె బిందెల కథ ఏందో.. జేబులో కత్తెర్లు పట్టుకుని తిరుగుడేందో తనకు అర్ధం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇక రేవంత్ కచ్చితంగా ఐదేళ్లూ పదవిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్... అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల గురించి, కేసీఆర్ కు రేవంత్ కు ఉన్న తేడా గురించి ప్రజలకు తెలియదని అన్నారు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే... రేవంత్ లాంటి వారు ఉంటేనే కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.