Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డితో స్నేహంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

అవును... బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   31 July 2024 3:30 PM GMT
రేవంత్ రెడ్డితో స్నేహంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అయితే... ఏపీ అసెంబ్లీ మాదిరి కాకుండా అధికార, విపక్షాల మధ్య ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుండటం శుభపరిణామం అనే చెప్పాలి. ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గురించి స్పందిస్తూ... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏకవచనంతో సంభోధించారు. దీంతో.. అధికారపక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. ఆయనకు లేని బాధ మీకెందుకు అంటూనే కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మట్లాడిన కేటీఆర్... రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, సుమారు 18ఏళ్ల నుంచి తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇద్దరం కలిసి ఇదే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు. కాకపొతే 10 ఏళ్లుగా చెడిందని, సత్సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పిన కేటీఆర్... చిన్న వయసులోనే రేవంత్ కు సీఎం అయ్యే అదృష్టం వరించిందని తెలిపారు.

అనంతరం... గత పదిఏళ్లుగా ఏం జరిగిందో చెబుదామంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ కి కేసీఆర్ ఫోబియా పట్టుకుందంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. ఇదే సమయంలో... కాంగ్రెస్ నేతలు మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అంటున్నారని.. చెరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు తెలంగాణపై కేసీఆర్ అనవాళ్లు అని కేటీఆర్ వెళ్లడించారు.

ఈ సందర్భంగా... కాళేశ్వరం జలసవ్వడిలో.. కాకతీయ చెరువు మత్తడిలో.. భరీరథ నల్లా నీళ్లలో... పాలమూరు జలధారల్లో.. సీతారమ ఎత్తిపోతల్లో.. గురుకుల బడుల్లో.. యాదాద్రి గుడి యశస్సులో.. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో.. మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో.. కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ వెళ్లడించారు.

ఇదే సమయంలో... కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో.. మీరు కుర్చున్న సచివాలయ సౌధ రాజసంలో, టీ హబ్ లో, టీ వర్క్స్ లో, వీ హబ్ సృజనలో.. ప్రపంచలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో.. వ్యూహాత్మక రహదారుల దర్జాలో.. అమరదీపం ఆశయాల్లో కేసీఆర్ ఉన్నారంటూ కేటీఆర్ యత్రిప్రాసలతో వెళ్లడించారు.