Begin typing your search above and press return to search.

అప్పుడు కేటీఆర్ జీతం నాలుగున్నర లక్షలు!

తెలంగాణలో బీఆర్ఎస్ ను వరుసగా మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు సాగుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:30 AM GMT
అప్పుడు కేటీఆర్ జీతం నాలుగున్నర లక్షలు!
X

తెలంగాణలో బీఆర్ఎస్ ను వరుసగా మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ విషయంలో దూకుడు మీదున్నారు. తాజాగా మరోసారి బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు తన జీతమెంతో కేటీఆర్ వెల్లడించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లిద్దరూ సరిగ్గా చదువుకోలేదని కేటీఆర్ విమర్శించారు. తాను ఉన్నతంగా చదివానని పేర్కొన్నారు. తాను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని అని, అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నానని కేటీఆర్ తెలిపారు. అంతే కాకుండా అక్కడ మంచి వేతనంతో పని చేశానని పేర్కొన్నారు. 2004లో ఇండియాకు తిరిగొచ్చేటప్పుడు తన నెల జీతం రూ.నాలుగున్నర లక్షలు అని కేటీఆర్ వెల్లడించారు.

అంతే కాకుండా ఇప్పటికీ అదే ఉద్యోగం చేస్తుంటే నెలకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకూ సంపాదించేవాణ్నని చెప్పారు. అందుకే ముందుగా తమను విమర్శించే వాళ్లు ఇది తెలుసుకోవాలని కేటీఆర్ మండిపడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్.. అక్కడే కొంత కాలం పాటు ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వదేశం తిరిగొచ్చి.. ఇక్కడ రాజకీయాల్లో చేరి తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ఎదిగారనే చెప్పాలి.