Begin typing your search above and press return to search.

మధ్యతరగతి జీవులకు తీపి కబురు చెప్పిన కేటీఆర్

ప్రభుత్వం ఏదైనా సరే.. నిరుపేదలు.. పేదలు.. దిగువ మధ్యతరగతి వారికి తప్పించి.. వేతన జీవులు.. మధ్యతరగతి వారికి ప్రకటించే వరాలు ఉండవు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:30 PM GMT
మధ్యతరగతి జీవులకు తీపి కబురు చెప్పిన కేటీఆర్
X

ప్రభుత్వం ఏదైనా సరే.. నిరుపేదలు.. పేదలు.. దిగువ మధ్యతరగతి వారికి తప్పించి.. వేతన జీవులు.. మధ్యతరగతి వారికి ప్రకటించే వరాలు ఉండవు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక హామీ ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ హామీ మీద పెద్దగా ప్రచారం జరగటం లేదు. ఇంతకూ ఆ హామీ ఏమిటి? ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఆ హామీని ఇస్తున్నారన్న విషయాన్ని చూస్తే.. వేతనజీవులుగా చెప్పాలి

నిరుపేదలకు.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కొనసాగిస్తామని.. గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని.. అదే సమయంలో 1200 - 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కొనే వారు తీసుకునే ఇంటి రుణాల వడ్డీ చెల్లింపుల్లో ప్రయోజనం కలిగించే అంశం మీద కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఆలోచన ఎన్నికల మీద పెద్ద సమూహాన్ని ప్రభావితం చేసేదిగా చెప్పాలి. ఈ అంశం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయన్న మాట వినిపిస్తోంది.

తాము ఎలాంటి ప్రయోజనాల్ని పొందట్లేదన్న భావన మధ్యతరగతి జీవుల్లో ఉన్న వేళ.. కేటీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన హామీ పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపటం ఖాయం. మరి.. ఇలాంటి వాటి గురించి ఎందుకు ప్రచారం చేసుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా హాజరైన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కేటీఆరర్.. కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడి రియల్ ఎస్టేట్ అమ్మకాలు భారీగా పడిపోయినట్లుగా ఒక సంస్థ రిపోర్టు ఇచ్చిందని పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు 28 శాతానికి పడిపోయినట్ులగా పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం.. సమర్థ నాయకత్వం ఉంటేనే పురోగతి కొనసాగుతుందని పేర్కొన్న కేటీఆర్.. ఆటో పైలట్ మోడ్ లో డెవలప్ మెంట్ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అధికారంలో ఉంటే నిర్ణయాల్ని తీసుకోవటానికి చాలా సమయం తీసుకుంటారని.. ఎందుకంటే వారంతా ఢిల్లీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు.

ఐటీ ఉత్పత్తుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసినట్లు చెప్పిన కేటీఆర్.. ప్రస్తుతం ఏటా రూ.2.41 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగినట్లుగా పేర్కొన్నారు. ప్రతి మెట్రో స్టేషన్ చుట్టూ 3-4 కిలోమీటర్ల మేర ఉచిత షటిల్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొస్తామని.. సురక్షితంగా నడిచేలా పాదచారుల బాటలు వేస్తామన్న కేటీఆర్ మాటలు ఆసక్తికరంగా మారాయి.