కేటీయార్ గట్టిగా ఇరుక్కున్నట్టేనా ?
హెచ్ఎండీఏ సెక్రటరిగా పనిచేసిన అర్వింద్ కుమార్ విచారణలో పై విధంగా చెప్పినట్లు సమాచారం.
By: Tupaki Desk | 9 Feb 2024 4:43 AM GMTఫార్ములా ఈ రేసింగ్ కుంభకోణంలో మాజీమంత్రి కేటీయార్ గట్టిగా తగులుకున్నట్లేనా ? హెచ్ఎండీఏ సెక్రటరిగా పనిచేసిన అర్వింద్ కుమార్ విచారణలో పై విధంగా చెప్పినట్లు సమాచారం. విషయం ఏమిటంటే కేసీయార్ పాలనలో హెచ్ఎండీఏ పరిధిలో ఫార్ములా ఇ రేసింగ్ నిర్వహించాలని అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం రు. 55 కోట్లను హెచ్ఎండీఏ ఖర్చుచేసింది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రేసింగ్ ఏర్పాట్లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. చివరకు అనేక కారణాలతో రేసింగ్ రద్దయిపోయింది.
మరి నిర్వహణకు చేసిన రు. 55 కోట్లు వ్యయం ఏమైనట్లు ? అందుకనే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలను సేకరించింది. అప్పటి హెచ్ఎండీఏ ఉన్నతాధికారిగా పనిచేసిన అర్వింద్ కుమార్ కు చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీచేశారు. షార్ముల రేసింగ్ ఏర్పాట్లు, జరిగిన వ్యయం, నిధుల విడుదలకు అనుమతులపై వివరణ ఇవ్వాలని అర్వింద్ ను చీఫ్ సెక్రటరీ అడిగారు. అందుకు అర్వింద్ సమాధానమిస్తు అనుమతులు లేకుండానే రు. 55 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు.
హెచ్ఎండీఏ నిధులనే ఖర్చుచేసిన కారణంగా నిధుల కోసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం అనుమతి అంటే కేటీయార్ నోటిమాటతోనే పనులన్నీ జరిపించినట్లు రాతమూలకంగానే అర్వింద్ సమాధానమిచ్చారని సమాచారం. ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండానే కేవలం మంత్రి నోటిమాటతో రు. 55 కోట్లు అర్వింద్ ఖర్చులు చేశారని తెలిసి చీఫ్ సెక్రటరీకి మతిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న అర్వింద్ కు ప్రభుత్వ ప్రొసీజర్ తెలీదని అనుకునేందుకు లేదు.
అందుకనే అప్పట్లో ఏమి జరిగిందో వివరణ ఇవ్వాలన్న నోటీసుకు అర్వింద్ రాతమూలకంగా సమాధానం చెప్పారట. అందులో కేటీయార్ చెబితేనే తాను కోట్లాదిరూపాయలు ఖర్చు చేసినట్లు స్పష్టంగా చెప్పారట. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీయార్ ఆదేశాలతోనే హెచ్ఎండీఏ నిధులను ఖర్చుచేసినట్లు అర్వింద్ చెప్పారు. అంటే ఇపుడు విషయం ఏమిటంటే తనను రక్షించుకోవాలంటే కేటీయార్ ఇన్వాల్వ్ మెంటును అర్వింద్ చెప్పితీరాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఒక ఐఏఎస్ అధికారి రు. 55 కోట్లు ఖర్చుచేసే అవకాశంలేదు. కాబట్టి అర్వింద్ ఇచ్చిన రాతపూర్వక స్టేట్మెంట్ తో కేటీయార్ తగులుకున్నట్లే అనిపిస్తోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.