Begin typing your search above and press return to search.

కుమార సంభ‌వం.. కేసీఆర్ కోస‌మా? బీజేపీ కోస‌మా?

మాజీ సీఎం కుమార స్వామి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 6:00 PM IST
కుమార సంభ‌వం.. కేసీఆర్ కోస‌మా?  బీజేపీ కోస‌మా?
X

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పోరాడుకున్న‌.. పోట్లాడుకున్న నాయ‌కులు అవ‌కాశం-అవ‌స‌రం నేప‌థ్యంలో చేతులు క‌లిపిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ప‌రిణామ‌మ‌నే తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌తిప‌క్ష ప్రాంతీయ పార్టీ జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమార స్వామి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

కుమార‌స్వామి కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌న ప్ర‌సంగంలో ఆయ‌న కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాంగ్రెస్ గ్యారెంటీల‌ను న‌మ్మొద్ద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ ఏడాది కర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ 5 గ్యారెంటీల‌ను ఇచ్చింద‌ని.. వాటిలో ఒక్క‌దానిని కూడా సంపూర్ణంగా అమ‌లు చేయ‌లేక పోతోంద‌న్న‌ది కుమార స్వామి చెప్పిన మాట‌.

ఇక‌, క‌ర్ణాట‌క‌లో రైతుల‌ను ఆదుకుంటామ‌ని చెప్పిన కాంగ్రెస్ వారిని గాలికి వ‌దిలేసింద‌ని కుమార స్వామి వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లుఈ ఆరు మాసాల్లో(కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌) భారీగా పెరిగాయ‌ని.. రైతుల‌కు కాంగ్రెస్ చేసింది ఏమీలేద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విమ‌ర్శ‌.. కాంగ్రెస్ వ‌చ్చాక పాల‌న కుంటుబ‌డి.. సీఎం కుర్చీ కోసం నాయ‌కులు త‌గువులు పెట్టుకుంటున్నార‌ని అన్నారు. దీంతో ప్ర‌జ‌లకు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య అంత‌రం పెరిగిపోయింద‌న్ని చెప్పారు.

క‌ట్ చేస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోకుమార చేసిన వ్యాఖ్య‌లు.. ఏ పార్టీని దృష్టిలో పెట్టుకునిచేశారు? ఆయ‌న ఏ పార్టీకిమ‌ద్ద‌తుగా మాట్లాడార‌నేది ఆస‌క్తిగా మారింది. గ‌త క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి దూరంగా ఉంటూ జేడీఎస్ స్వ‌తంత్రంగా పోటీ చేసింది. అనంత‌రం.. మోడీకిమ‌ద్ద‌తుఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో ఆపార్టీకి ద‌న్నుగా వ్య‌వ‌హ‌రించారా? అనేది ప్ర‌శ్న‌. ఇక‌, త‌మ‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పిన ఓ నేత‌(కేసీఆర్ అనే ప్ర‌చారం ఉంది) చేతులు ఎత్తేశార‌ని..అందుకే తాము డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌లేద‌ని.. కుమార‌స్వామి చెప్పుకొచ్చారు.

సో.. దీంతో బీఆర్ఎస్‌తో అనుబంధంఆయ‌న తెంచుకున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు లేవ‌నెత్తిన అంశాల‌ను ప‌రిశీలిస్తే.. బీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, బీజేపీ మాత్రం త‌మ‌కు అనుకూలంగానే కుమార మాట్లాడార‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్నారు. మొత్తానికి కుమార వ్యాఖ్య‌లు హ‌ల్చ‌ల్ అయినా.. నేరుగా ఆయ‌న ఏ పార్టీని స‌మ‌ర్థిస్తార‌నేది చూడాలి.