Begin typing your search above and press return to search.

రేవంత్ ను దేవుడిని చేసిన కుమారీ ఆంటీ

తెలంగాణ రాజకీయాల్లో తక్కువ టైంలో రాజకీయ చాణక్యంతో మొండి ధైర్యంతో పోరాడుతూ ఎదిగిన నేత రేవంత్ రెడ్డి. ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా అందరి ఆమోదంతో నామినేట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 9:49 AM GMT
రేవంత్ ను దేవుడిని చేసిన కుమారీ ఆంటీ
X

తెలంగాణ రాజకీయాల్లో తక్కువ టైంలో రాజకీయ చాణక్యంతో మొండి ధైర్యంతో పోరాడుతూ ఎదిగిన నేత రేవంత్ రెడ్డి. ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా అందరి ఆమోదంతో నామినేట్ అయ్యారు. తన ధైర్యసాహసాలతో ఇచ్చిన వాగ్దానాలతో ప్రజాదరణ పొందారు. ఆయన్ని అభిమానించే వారి సంఖ్య కాంగ్రెస్ లో పెరుగుతోంది. అయితే, ఇటీవల ఒక ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ లో చిరు వ్యాపారం చేసుకునే కుమారీ ఆంటీ అనే మహిళ రేవంత్ రెడ్డిని దేవుడిలా కొలుస్తూ పూజలు చేస్తున్న ఘటన వైరల్ అయ్యింది..

హైదరాబాద్‌లో నివసించే కుమారీ ఆంటీ తనకు ఎంతో మేలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని అత్యంత ఆరాధనతో పూజించడమే కాకుండా, ఆయన ఫొటోకు అర్చనలు చేస్తూ, దీపారాధనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలిచారు. ఆమె మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తును మార్చగల నాయ‌కుడు. ఆయన నాయకత్వంలో ప్రజలు సుఖంగా ఉండగలరు” అంటూ చెబుతోంది..

- రేవంత్ రెడ్డికి పూజ ఎందుకు?

కుమారీ ఆంటీకి క్రేజ్ రావడంతో ఆమె వ్యాపారాన్ని పోలీసులు మూసివేయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆమెకు పర్మిషన్ ఇచ్చి ప్రోత్సహాకాలు కూడా అందించాడు. దీంతో తనకు అండగా నిలిచిన రేవంత్ రెడ్డిని దైవంగా కొలుస్తూ తాజాగా ఓ వీడియోలో కుమారీ ఆంటీ కనిపించింది.

ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తాయి.. బీఆర్ఎస్ శ్రేణులు ఇదంతా కాంగ్రెస్ పీఆర్ స్టంట్ అంటూ దెప్పిపొడుస్తున్నాయి. కాంగ్రెస్ వాదులు మాత్రం రేవంత్ రెడ్డి ప్రజాదరణకు నిదర్శనంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయ నాయకులను గౌరవించటం సాధారణమే కానీ, దేవుడిలా పూజించడం కొంత విభిన్నమైన పరిణామం. ఇది వ్యక్తిగత అభిప్రాయం, ప్రజా విశ్వాసానికి సంకేతం. అయితే, రాజకీయ నేతలు తమ బాధ్యతను గుర్తుంచుకొని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. లేదంటే కనమరుగవుతారు.