కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ బంద్... రంగంలోకి యంగ్ హీరో!
అవును... గతకొన్ని రోజులుగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 31 Jan 2024 7:30 AM GMTగతకొంతకాలం కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే! హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన మాదాపూర్ ఏరియాలో ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఈమె రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే ఇటీవల ఓ వీడియో వల్ల ఈమె మరింత ఫేమస్ అవ్వడంతోపాటు కొన్ని ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఆమె ఫుడ్ పాయింట్ ని ట్రాఫిక్ పోలీసులు బంద్ చేయించారు. దీంతో యంగ్ హీరో రంగంలోకి దిగారు.
అవును... గతకొన్ని రోజులుగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈమె వ్యాపారం పొలిటికల్ రంగు కూడా పులుముకుందని అంటున్నారు!! దీంతో ఈమె వీడియోలు మరింత వైరల్ అవ్వడం మొదలయ్యిందని చెబుతున్నారు. ఈ సమయంలో సడన్ గా అన్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు! ఇందులో భాగంగా తెరపైకి ట్రాఫిక్ జాం సమస్యను తెచ్చారు. ఫలితంగా... ఫుడ్ కోర్టు మూసెయ్యాలని అన్నారు.
ఇలా కుమారి అంటీ ఫుడ్ స్టాల్ కు చాలా మంది వస్తుండటంతో ట్రాఫిక్ జాం అవుతోందని చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ ఫుడ్ కోర్టును మూసేయించారు! అయితే, పోలీసులు తమను షాప్ ఎందుకు తెరవనివ్వడం లేదో అర్థం కావడం లేదని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు పొలిటికల్ పార్టీల ప్రసథావన రావడంతోనే ట్రాఫిక్ సమస్య గుర్తుకొచ్చిందా అంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారని తెలుస్తుంది.
ఈ సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను మూసివేయించడంపై టాలీవుడ్ సందీప్ కిషన్ స్పందించారు. "ఊరు పేరు భైరవకోన" సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ తో పాటు మూవీ టీం ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. అయితే, ఈలోగానే ఇలా జరగడంతో సందీప్ కిషన్ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఇది సరైన చర్య కాదని, ఆమెకు సహాయం చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన సందీప్ కిషన్... "ఇది సరైన చర్య కాదు..! సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచేందుకు ఆమె చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళా సాధికారితకు.. ఆమె నేను చూసిన ఉదాహరణ.. నేను, నా టీం ఆమెతో మాట్లాడతాం. ఆమెకు వీలైనంత మేర సాయం చేస్తాం" అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కి నెట్టింట ఫుల్ గా రిప్లైస్ వస్తున్నాయి.. ఇందులో భాగంగా సందీప్ కిషన్ కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.