Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి బైరెడ్డి శబరి స్పెల్లింగ్ “మిస్టేక్” రిక్వస్ట్... ట్రోలింగ్ స్టార్ట్!

అవును... ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.

By:  Tupaki Desk   |   18 March 2025 9:24 AM IST
కేంద్రమంత్రికి బైరెడ్డి శబరి స్పెల్లింగ్  “మిస్టేక్” రిక్వస్ట్... ట్రోలింగ్  స్టార్ట్!
X

"ఓర్వకల్ లో ఉన్న విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు, సీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఈ రోజు కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది"! ఇది నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ‘ఎక్స్’ వేదికగా ఫోటోతో పాటు చేసిన పోస్ట్.

అవును... ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. కర్నూలు నుంచి సుమారు 26 కి.మీ దూరంలో ఈ విమానాశ్రయం ఉంది. వ్యవసాయం, తయారీ, సేవల రంగాలతో సమతుల్య ఆర్థిక వ్యవస్థతో ఉన్న కర్నూలు జిల్లాకు ఎయిర్ పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో నాటి టీడీపీ సర్కార్ 2019 నాటికి దీని నిర్మాణం పూర్తి చేసింది.

అయితే అప్పటికే 2019 ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర సమర యోధుడు, “ఉయ్యలవాడ నరసింహారెడ్డి” పేరును పెట్టారు. ఈ పేరుతోనే ఆయన విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

గూగుల్ లో సెర్చ్ చేస్తే.. ఆ ఎయిర్ పోర్ట్ పేరు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం" అనే ఉంటుంది. కట్ చేస్తే... తాజాగా నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తాజాగా ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ వినతిపత్రం ఇచ్చారు.

అందులో కర్నూలు ఎయిర్ పోర్టుకు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” పేరు పెట్టాలని ఆమె కోరారు. ఇదే సమయంలో.. ఆయన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని.. ఇందులో భాగంగా... “ఉయ్యాలవాస నరసింహారెడ్డి”| అని తప్పుగా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని.. ఆమె కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని వీలైనంత తొందరగా మార్చాలని ఆమె కోరారు!

అయితే... ఓర్వకల్ లో ఉన్న విమానాశ్రయానికి “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” పేరు పెట్టాలని ఈరోజు కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని ఎంపీ ఎక్స్ వేదికగా ప్రకటించడంతో.. ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఉన్న పేరును మళ్లీ పెట్టడం ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంటిపేరులోని ఉయ్యాలవాడ స్పెల్లింగ్ ఉయ్యాలవాస అని తప్పుగా పడిందనే విషయం తన దృష్టికి వచ్చిందని.. దాన్ని కరెక్ట్ చేయాలని శబరి.. కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చారు! అక్కడితో ఆగకుండా... ఎయిర్ పోర్ట్ కు అధికారికంగా ఉయ్యలావాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోరినట్లు చెప్పడంతో ట్రోల్స్ మొదలైపోయాయి.