టీడీపీలో మేడం సార్.. రూటు.. సెపరేట్ అంట..!
అయితే టీడీపీలో కొందరు మహిళా నాయకురాళ్ల విషయంలో ఇప్పుడు కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.
By: Tupaki Desk | 4 Dec 2024 8:30 AM GMTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకులు చాలా మంది విజయం దక్కించుకున్నారు. వీరిలో టీడీపీ నుంచి ఎక్కువగా ఉండగా.. జనసేన నుంచి ఒకరు ఉన్నారు. సాధారణంగా పురుష నాయకులతో పోల్చితే.. మహిళా నాయకురాళ్ల దూకుడు తక్కువగా ఉంటుంది.. పని ఎక్కువగా ఉంటుంది. ప్రజల నుంచి సమస్యలు వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు కూడా మహిళా నాయకులు ప్రయత్నిస్తారు. అందుకే వారికి రాజకీయాల్లో సానుభూతి ఎక్కువ. అయితే టీడీపీలో కొందరు మహిళా నాయకురాళ్ల విషయంలో ఇప్పుడు కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. వారు కూడా ముదిరిపోయారని సపరేటు రేటు మాట్లాడుకుని భేరసారాలు ఆడుతున్నారని టాక్ ? మరి టీడీపీలో ఆ మేడం ల రేటు ఏంటి ? ఆ సప రేటు ఏంటో ఆ కథ ఏంటో చూద్దాం.
టీడీపీలో ఉన్న కట్టుబాట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అధినేతకు తెలిసిపోయే వ్యవస్థ కూడా ఉంది. దీనికితోడు అనుకూల మీడియా డేగ కళ్లు ఎప్పుడూ ఎమ్మెల్యేలపై సారిస్తూనే ఉంటారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేయాలంటే..ఒకప్పుడు తల్లడిల్లేవారు. అంతేకాదు.. బయటకు పొక్కకుండా చాలా మంది మేనేజ్ చేసేవారు. ఇక, ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ.. ఈ వ్యవస్థ దారి తప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా చంద్రబాబు చెంతకు చేరిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీలోని మహిళా ఎమ్మెల్యేల్లో ఇద్దరు నుంచి ముగ్గురి వరకు తీవ్ర వివాదాస్పద రేటింగ్‌లో ఉన్నారని పార్టీ కార్యాలయంలో నాయకులు చర్చిస్తున్నారు. ఇదేమీ గుసగుసకాదు. బాహాటంగానే చెబుతున్నారు. సాధారణంగా పురుష ఎమ్మెల్యేలు దూకుడుగా ఉంటే.. ఈ సారి గతానికి భిన్నంగా రాయలసీమ నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఒకరు చాలా చాలా దూకుడుగా ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
అయితే..ఈ దూకుడు ప్రజలకు మేలు చేస్తే బెటరే. కానీ, కమీషన్లు, వాటాల కోసం ఈ మహిళా ఎమ్మెల్యే లు తమదైన శైలిలో దూకుడు చూపిస్తున్నారట. ఇదే ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకరైతే సొంత తమ్ముడిని రంగంలోకి దింపి. వ్యవహారాలు నడిపిస్తుండగా.. మరొకరి భర్త అంతా తానై వ్యవహాలు చూస్తున్నారు. ఇక, ఇంకొకరు నేరుగా నోరు చేసుకుని మరీ కమీషన్ల పర్వానికి తెరదీశారు. సీమలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో ఒక మహిళా ఎమ్మెల్యే భర్త అంతా తానై వ్యవహరిస్తూ దోపిడీకి తెరలేపారు.
ఇక మరో మహిళా ఎమ్మెల్యే బావ, అమ్మతో పాటు చెల్లి కూడా రంగంలోకి దిగి కమీషన్ల వేటలో మునిగి తేలుతున్నారట. ఇక ఓ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అయితే ఎవరైనా వార్తలు రాసేందుకు సాహసిస్తే.. `వాణ్ణి నేను రమ్మన్నానని చెప్పండి` అంటూ వార్నింగులే ఇస్తున్నారు సదరు మేడం సార్. వీరి రేటు.. రూటు కూడా.. ఇప్పుడు చంద్రబాబు వద్దకు చేరింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.