దావూద్‌తో ప్రాణహానీ.. ఐపీఎల్ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా.. లలిత్ మోడీ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహానీ వల్లే దేశం విడిచినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 25 Nov 2024 2:30 PM GMTఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ ఒకప్పుడు ఇండియాలో ఓ వెలుగు వెలిగాడు. 2008లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆటను తీసుకొచ్చారు. దాని ఆధారంగా ప్రీమిలియర్ లీడ్ ప్రారంభించడంలో లలిత్ మోడీ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు.
టీ20కి భారత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లలిత్ మోడీ ఎంతలా పేరు తీసుకొచ్చాడో.. ఆ తరువాత కాలంలో పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌తోపాటు ఐపీఎల్‌తో ప్రాక్సీ యాజమాన్యం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 2010లో ఆయన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి దేశానికి వచ్చేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన అప్పటి నుంచి లండన్‌లోనే ఉండిపోయారు.
తాజాగా.. లలిత్ మోడీ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహానీ వల్లే దేశం విడిచినట్లు తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటి అక్రమ వ్యవహారాలపై తనకున్న జీరో టోలరెన్స్ పాలసీ కారణంగా దావూద్ తనను టార్గెట్ చేశాడని వివరించారు. తన హత్యకు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని, దీనిపై ఆధారాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే దేశం విడిచి వెళ్లినట్లు స్పష్టం చేశారు.
వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ అధికారులతో కలిసి రూ.753 కోట్లను మోసం చేశారని లలిత్ మోడీపై బీసీసీఐ ఆరోపించింది. ఆ కారణంగానే లలిత్ మోడీని బీసీసీఐ నుంచి సస్పెండ్ సైతం చేశారు.