Begin typing your search above and press return to search.

లాలు సూచనతో ఇంటివాడైన గ్యాంగ్ స్టర్... కారణం తెలిస్తే షాకే!

అవును... నవాదా జిల్లాలోని కోనన్ పుర్ గ్రామానికి చెందిన అశోక్ మహతా అనే వ్యక్తి..

By:  Tupaki Desk   |   21 March 2024 8:03 AM GMT
లాలు సూచనతో ఇంటివాడైన గ్యాంగ్  స్టర్... కారణం తెలిస్తే షాకే!
X

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలతో ఒక కరుడుగట్టిన 60ఏళ్ల వయసున్న గ్యాంగ్ స్టర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా ఈ వయసులో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం రాత్రి పాట్నా సమీపంలోని ఆలయంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఇంత సడన్ గా ఈ గ్యాంగ్ స్టర్ వివాహం ఎందుకు చేసుకున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... నవాదా జిల్లాలోని కోనన్ పుర్ గ్రామానికి చెందిన అశోక్ మహతా అనే వ్యక్తి.. షేక్ పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతో పాటుగా... నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో సుమారు 17ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో గత ఏడాదిలోనే జైలు నుంచి విడుదలయ్యాడు.

ఇలా సుమారు 17ఏళ్లపాటు జైలు జీవితం అనుభవించిన అశోక్ మహతాకూ రాజకీయాల్లోకి రావాలని అనిపించిందంట. ఇందులో భాగంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి పార్లమెంట్ కు వెళ్లాలని ఫిక్సయ్యారంట. అయితే చట్టప్రకారం అది సాధ్యం కాకపోవడంతో... లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిశారని తెలుస్తుంది. ఈ సమయంలో లాలూ ప్రసాద్ ఒక సలహా ఇచ్చారంట. ఇందులో భాగంగా పెళ్లి చేసుకుని భార్యను నిలబెట్టాలని సూచించారంట.

దీంతో... లాలూ సూచించారు మహతా పాటించారు అన్నట్లుగా ఆయన పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యారంట. ఈ క్రమంలో... లాలూ సూచనలతో పాట్నా భక్తియార్ పుర్ లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను తన మద్దతుదారుల సమక్షంలో అశోక్ మహతా వివాహం చేసుకున్నాడు. ముంగేర్ బరియార్ పూర్ గ్రామానికి చెందిన ఆమె గతంలో ఢిల్లీలో పనిచేసేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె అశోక్ మహతాకి భార్య అవ్వడంతో ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు!

ఇందులో భాగంగా అశోక్ మహత తన భార్యను ముంగేర్ లోక్ సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలోకి దింపబోతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీచేస్తున్నారు. దీంతో... ఈ పోటీ ఆసక్తిగా మారింది. ఈ గ్యాంగ్ స్టర్ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారారంట!!