Begin typing your search above and press return to search.

కొండలా గడ్డ కట్టిన సముద్రం... ఏమిటీ ఊరు స్పెషాలిటీ?

ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మహాద్భుతాలు. కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని.. హృదయానికి గోచరమయ్యేవి ఇంకొన్ని.

By:  Tupaki Desk   |   24 Sep 2023 12:30 PM GMT
కొండలా గడ్డ కట్టిన సముద్రం... ఏమిటీ ఊరు స్పెషాలిటీ?
X

ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మహాద్భుతాలు. కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని.. హృదయానికి గోచరమయ్యేవి ఇంకొన్ని. ఈ ప్రకృతికి మించిన అందగత్తె, అందగాడు ఉండడు ఈ జగాన్న అని అంటారు. దేవుడిని నమ్మేవారు... ఈ సృష్టిలో ఇవన్నీ దేవుడు సృష్టించిన అద్భుతాలు అని అంటే... నాస్తికులు మాత్రం... ఇవన్నీ కాలక్రమేణా జరిగిన సంఘటనలు అని చెప్పుకొస్తారు.

వెర్షన్ ఏదైనా, అభిప్రాయం ఎవరిదైనా, ఆ అభిప్రాయం ఎలాంటిదైనా ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో అందాలు దాగి ఉన్నాయనేది వాస్తవం. అలాంటి అద్భుతాల్లో ఒకటి "నియాకోర్నాట్‌" అనే గ్రామం. అవును... ఖండం ఏదైనా, దేశం మరేదైనా... గ్రామాల్లో ఉండే అందాలు, ఆహ్లాదాల లెక్కే వేరు. ప్రకృతి సిద్ధంగా కలిగిన అందాల ముందు.. ఆర్టిఫిషియల్ అందాలు దిగదుడుపే. ఒక్క మాటలో చెప్పాలంటే... జుజుబీ.. అన్నమాట!

అవును... గ్రీన్‌ ల్యాండ్‌ వాయవ్య ప్రాంతంలోని నుసువాక్‌ ద్వీపకల్పానికి ఉత్తరతీరంలో ఒక గ్రామం ఉంది. ఇది ప్రపంచానికి చిట్టచివరి గ్రామం అన్న మాట. ఇక్కడ సముద్రం.. కెరటాలు, ఆ కెరటాల ధవనులు, ముందుకి వెళ్లడాలు, వెనక్కి వెళ్లడాలు వంటివి ఉండవు. అసలు కెరటాలే కనిపించవు... కొండలా గడ్డ కట్టీ కనిపిస్తుంది.

ఇదే సమయంలో పెద్ద పెద్ద మంచు పెళ్లలు కనుచూపుమేరలో నీట మునుగుతుంటాయి. ఇక్కడ భయంకరమైన ఉష్ణోగ్రతలు ఒకసారి ఉక్కబోత కలిపిస్తే, తట్టుకోలేనంత చలిగాలులు మరోసారి వణికిస్తాయి. ఈ గ్రామానికి ఏకైక ఆదాయమార్గం ఫిష్ ఫ్యాక్టరీ. అయితే ఇటీవల ఆ ఫ్యాక్టరీ మూతబడింది. దీంతో... చాలామంది జీవనాధారం కోసం మకాం మార్చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ గ్రామంపై కొంతమందికి మితిమీరిన మకారం ఉంది. అయితే... ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో 50 కంటే తక్కువ జనాభా ఉంటే బలవంతంగా గ్రామవాసులను పరిసర పట్టణాల్లోకి తరలిస్తుంటారు. అయితే 2011లో 52 మంది జనాభాతో ఈ గ్రామం ఉనికి నిలుపుకోగలిగింది. పట్టాణాలకు తరలాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కింది.

అయితే 2020 జనాభా లెక్కల ప్రకారం గ్రామస్థుల సంఖ్య ఊహించని విధంగా 34కి తగ్గిపోయింది. దీంతో ఈ గ్రామస్థులందరినీ పట్టణాలకు తరలించారు. దీంతో ఈ గ్రామం గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేకుండా అయిపోయింది. అయితే ఈ ప్రపంచపు చిట్ట చివరి గ్రామాన్ని పర్యాటకంగా సందర్శించడం కుదురుతుందా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.