తెలంగాణాలో కొత్త సర్వే....ఎవరికి అధికారం అంటే....?
తెలంగాణా ఎన్నికలు చూస్తే కచ్చితంగా నలభై రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్నాయి.
By: Tupaki Desk | 22 Oct 2023 8:15 AM GMTతెలంగాణా ఎన్నికలు చూస్తే కచ్చితంగా నలభై రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరిది విజయం అన్నదే చర్చగా ఉంది. హోరా హోరీగా పోరు సాగుతుంది అని సర్వేలు చెబుతున్నాయి. అయితే వరసబెట్టి వస్తున్న సర్వేలు చూస్తే చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని చెబుతున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కి ఆధిక్యత ఇస్తూంటే మరికొన్ని సర్వేలు బీయారెస్ కి ఇస్తున్నాయి.
ఇపుడు కొత్తగా ఇంకో సర్వే తెలంగాణ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ సర్వే చూస్తే కనుక బీయారెస్ కి ఆధిక్యం ఉందని చెబుతోంది. ఈ సర్వే సీట్ల గురించి చెప్పకుండా ఓట్ల షేర్ ని చెబుతూ రిలీజ్ చేసింది. దీని ఆధిక్యం బట్టి సీట్లను లెక్క చూసుకోవాలన్న మాట. ఈ కొత్త సర్వే మిషన్ చాణక్య అన్న సంస్థది. దీని ప్రకారం చూసుకుంటే బీయారెస్ కి 44.62 శాతం ఓటు షేర్ వస్తుందని లెక్క తేల్చింది.
ఇక కీలకంగా మారి పోటీ పడుతున్న కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఆ పార్టీకి 32.71 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. అలాగే బీజేపీకి 17.6 శాతం ఓటు షేర్ వస్తే ఇతరులకు 5.07 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. మిషన్ చాణక్య సర్వే నివేదిక ప్రకారం చూస్తే తెలంగాణాలో మరోసారి బీయారెస్ అధికారంలోకి రావచ్చు అని తెలుస్తోంది.
అంతే కాదు మరే పార్టీకి దరిదాపులలో లేకుండా స్పష్టమైన ఆధ్క్యత వస్తుందని కూడా మిషన్ చాణక్య సర్వే చెబుతోంది. కేవలం మిషన్ చాణక్య మాత్రమే కాదు నిన్నటికి నిన్న విడుదల అయిన ఇండియా సర్వే కూడా బీయారెస్ కి భారీ ఎత్తున సీట్లను కట్టబెట్టింది. బీయారెస్ ఏకంగా 70 పైగా సీట్లను సాధించి మూడవసారి అధికారంలోకి వస్తుందని కూడా పేర్కొంది.
ఇలా చూస్తే ఇప్పటికి వస్తున్న సర్వేలలో కొన్ని కాంగ్రెస్ మరికొన్ని బీయారెస్ కి పట్టం కట్టడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇందులో కొన్ని సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంది. అయితే ఏ సర్వే సంస్థ అయినా పూర్తిగా నిజాలు చెప్పలేదు, ఆ టైం కి ఓటర్లలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రమే రాబట్టగలుగుతుంది.
ఇక చూస్తే ఇంకా నలభై రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సర్వేల విషయంలో కూడా కొంత తేడా చోటు చేసుకున్నా చేసుకోవచ్చు. కచ్చితమైన సాలిడ్ ఒపీనియన్ బయటకు రావాలీ అంటే కనుక నవంబర్ రెండవ వారం వరకూ ఆగాల్సిందే. అప్పటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఓటర్లకు అందరు అభ్యర్ధులు కళ్ల ముందు కనిపిస్తారు. ప్రచారం కూడా ఊపందుకుంటుంది. దాంతో ఆ సర్వే ఫలితాలు మాత్రం కచ్చితంగా నిలబడిపోతాయని చెప్పవచ్చు. అలా అని ఇపుడు వచ్చిన సర్వేల ఫలితాలను కొట్టేయడానికి లేదు.
ఓవరాల్ గా చూసుకుంటే బీయారెస్ ఏమీ తక్కువ తినలేదని, ఆ పార్టీని ఓడించడం అంత సులువు కాదని సర్వేలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత పెరిగినా బీయారెస్ ని ఓడించడానికి అది సరిపోవడంలేదని కూడా తాజా సర్వేలు తెలియచేస్తున్నాయి.