వైసీపీకి 'ప్రధాన ప్రతిపక్షం'... తాజా అప్డేట్ ఇదే...!
మరోవైపు.. వైసీపీ కూడా గతంలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర, యూపీలకు సంబంధించి ఇచ్చిన తీర్పులపై అధ్యయనం చేయిస్తోంది.
By: Tupaki Desk | 23 Aug 2024 7:05 AM GMTప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ప్రస్తుతం న్యాయ పోరాటానికి దిగింది. అయితే.. ఇది దక్కుతుం దా? లేదా అంటే.. మరో రెండేళ్ల సమయం పట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వైసీపీకి అనుకూలంగా తీర్పు వచ్చినా.. స్పీకర్ సహా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం.. మరింత జాప్యం జరుగుతుందన్నది న్యాయ వర్గాలు చెబుతున్న మాట. ప్రస్తుతం అయితే.. వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది.
కానీ, తాజాగా ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరింది. ఎందుకంటే.. మరికొద్ది రోజుల్లో హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. దీంతో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయంపై దృష్టి పెట్టిం ది. ఇప్పటికే స్పీకర్‌కు, ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంది. వీటికితోడు.. వాదనల విషయంలోనూ పక్కాగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించుకుం ది. ప్రజలు ఇవ్వని ప్రధాన ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇస్తామన్న సర్కారు వాదన.
అయితే.. ఈ వాదన కోర్టులో నిలిచేలా కనిపించడం లేదు. ప్రజలు కోరుకున్నట్టు ప్రభుత్వాలు చేస్తున్నా యా? పన్నుల భారం మోపద్దని ప్రజలు కోరుతున్నారు.. మరి మీరు పన్నులు ఎందుకు వేస్తున్నారు? ధరలు ఎందుకు పెంచుతున్నారు? అని కోర్టు ఎదురు ప్రశ్నిస్తే.. ప్రభుత్వం దగ్గర సమాధానం కనిపించ డం లేదు. ఈ నేపథ్యంలోనే బలమైన వాదనలు వినిపించేలా న్యాయవాదుల నుంచి నిపుణుల వరకు కూడా ఈ విషయంపై సలహాలు కోరుతోంది.
మరోవైపు.. వైసీపీ కూడా గతంలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర, యూపీలకు సంబంధించి ఇచ్చిన తీర్పులపై అధ్యయనం చేయిస్తోంది. ఆయా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజకీయ పక్షాలకు అనుకూలంగా ఉండడంతో వాటి మేరకు ఏపీలోనూ తీర్పులు వచ్చేలా చూసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సర్కారు అవసరమైతే.. మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా.. వైసీపీకి మరో రెండేళ్ల వరకు సంకట పరిస్థితే కొనసాగనుంది.