Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ లావు ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్ !

ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చినా ఆయనను అక్కున చేర్చుకుని టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 1:30 AM GMT
టీడీపీ ఎంపీ లావు ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్ !
X

లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ పేరు ఏపీ రాజకీయాల మీద కాస్తా అవగాహన ఉన్న వారు ఎవరికైనా తెలిసిందే. ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఎంపీగా వరసగా రెండవసారి గెలిచారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చినా ఆయనను అక్కున చేర్చుకుని టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది.

టీడీపీ కూటమి ప్రభంజనంలో లావు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఆయనను టీడీపీ అధినాయకత్వం మరింతగా గౌరవిస్తూ లోక్ సభలో పార్టీ నాయకుడిగా అవకాశం ఇచ్చింది. టీడీపీలో కూడా లావు కీలకంగా మారిపోయారు. అలా ఆయనకు పార్టీలో ఇపుడు మంచి గుర్తింపు దక్కుతోంది అని అంటున్నారు.

ఆయన ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు యువకుడిగా రాజకీయాల్లోకి రావడం వల్ల కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. టాలెంట్ ఉన్న వారిని చంద్రబాబు బాగా ప్రోత్సహిస్తారు. అందుకే లావుకు రైట్ టైమ్ లో రైట్ పార్టీ అన్నట్లుగా2024 ఎన్నికల వేళ తీసుకున్న నిర్ణయం ఆయనను ఇపుడు టీడీపీ యంగ్ టీమ్ లో టాప్ గా నిలిపింది.

అటు చంద్రబాబు ప్రోత్సాహం ఇటు యువ మంత్రి నారా లోకేష్ సహకారంతో టీడీపీలో లావు పూర్తి కంఫర్ట్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. నిజానికి లావు వైసీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న లావు డైనమిక్ లీడర్ గా ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా దానికి తగిన అవకాశాలు అయితే ఆయనకు వైసీపీలో దక్కలేదు అని అంటున్నారు.

లావుకు పార్లమెంట్ పరిధిలో ఆనాడు ఏ ఒక్క ఎమ్మెల్యే సహకరించిన పరిస్థితి లేకుండా పోయింది అని అంటారు. ఇక మంత్రి విడదల రజనీ తో అసలు పడేది కాదని అంటారు. ఇలా పార్టీని నియోజకవర్గానికి ఎంతో చేద్దామని ఆశపడిన లావుకు వైసీపీ పెద్దల తీరుతోనే ఆశాభంగం కలిగింది అని అంటారు.

దాంతోనే విసిగిపోయిన ఆయన టీడీపీలో చేరారు. అయితే లావుని కోల్పోయిన వైసీపీ రాజకీయంగా గుంటూరు జిల్లాలో ఇబ్బందులు పడుతూంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని లావు తన లాంగ్ టెర్మ్ కెరీర్ కి అద్భుతమైన బాటను వేసుకున్నారు అని అంటున్నారు

చిన్న వయసులోనే రెండు సార్లు ఎంపీ అంటే అది అదృష్టమే అని చెప్పాలి. ఇక టీడీపీలో ఆయనకు ఎంతో మర్యాద మన్నన దక్కుతున్నాయి. పార్లమెంట్ లో ఆయన టీడీపీకి లీడర్ గా ఉన్నారు. దాంతో రానున్న నాలుగున్నరేళ్ల కాలంలో మరింతగా శ్రమించి పార్టీకి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఈ యువ నేత తపన పడుతున్నారు.

మరోవైపు చూస్తే లోకేష్ యంగ్ టీమ్ లో లావుకు కీలక స్థానం ఉంది. రానున్న రోజులలో లావు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారని దానికి సంబంధించి ఇప్పటి నుంచే అన్నీ సరి చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన అలా ఆలోచించినా ప్రోత్సహించేందుకు పార్టీ పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో లావు మంత్రి అయినా ఆశ్చరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా లావు టీడీపీలోనే తన ఫ్యూచర్ పాలిటిక్స్ ని హ్యాపీగా కంటిన్యూ చేసేలాగా అంతా బాగా సాగుతోంది అని అంటున్నారు.