Begin typing your search above and press return to search.

జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కోసం ఫ్యామిలీ ఏమి చేస్తుందో తెలుసా?

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Oct 2024 9:30 AM GMT
జైల్లో ఉన్న లారెన్స్  బిష్ణోయ్ కోసం ఫ్యామిలీ ఏమి చేస్తుందో తెలుసా?
X

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మళ్లీ ముంబై మాఫియా చెతుల్లోకి వెళ్తోందా అనే చర్చా మొదలైంది. ఇలా ఆ సంచలనానికి, ఈ ఉలిక్కిపడటానికి, చర్చకూ కారణం లారెన్స్ బిష్ణోయ్!

దీంతో... అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మరోపక్క లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాస్తవానికి లారెన్స్ జైల్లో ఉన్నప్పటికీ.. అతడి సోదరుడు కెనడా నుంచి ఈ గ్యాంగ్ ను నడిపుస్తున్నట్లు చెబుతారు.

ఇటీవల జరిగిన సిద్ధిఖ్ హత్య తో పాటు.. అంతకుముందు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన వ్యవహారంతో పాటు.. మరికొంతమందికి బెదిరింపులు వస్తున్నాయనే ప్రచారం జరగడానికీ కెనడాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే కారణమని అంటున్నారు. ఈ సమాయంలో లారెన్స్ బిష్ణోయ్ కజిన్.. అతడి గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు.

అవును... గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో అతని గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... పంజాబ్ యూనివరిసిటీలో న్యాయవిద్యను పూర్తి చేసిన లారెన్స్... ఇలా గ్యాంగ్ స్టర్ అవుతాడని తానెప్పుడూ కనీసం ఊహించనుకూడా లేదని అన్నారు.

కాగా... లారెన్స్ బిష్ణోయ్ 2015 నుంచి జైలులో ఉన్నారు. ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) లు అనేక కేసుల్లో లారెన్స్ ను విచారిస్తుంది! ఇక, పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలో జన్మించిన లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు.. బాల్కరన్ బ్రార్. అయితే... స్కూల్లో చదువుతున్న సమయంలో అతడి పేరును లారెన్స్ బిష్ణోయ్ గా మారుచుకున్నాడు.

లారెన్స్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని దయానంద్ ఆంగ్లో వేద కళాశాలలో చేరాడు. ఈ క్రమంలో జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా చేశాడు. ఈ క్రమంలో... విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడటంతో లైఫ్ మారిందని చెబుతారు.

ఇందులో భాగంగా... కొన్నాళ్లకు మెల్లమెల్లగా అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అయితే... కాలేజ్ గ్యాంగ్ వార్ లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో.. అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు.