బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ పై కీలక సమాచారం!... తెరపైకి మరో పేరు!
ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Oct 2024 10:47 AM GMTఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. దసరా వేళ వినిపించిన తుపాకీ శబ్ధంతో దేశ ఆర్థిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తోన్న పోలీసులకు మరో కీలక విషయం తెలిసిందని అంటున్నారు.
అవును... బాబా సిద్ధిఖ్ హత్య కేసును విచారిస్తోన్న పోలీసులకు మరో మరో కీలక విషయం తెలిసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... మాజీ మంత్రి సిద్ధీఖ్ ని హత్య చేసిన గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖ్ పేరు కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.
ప్రస్తుతం పోలీసులు విచారణలో ఉన్న షూటర్లు... తండ్రీ కుమారులను చంపడానికే తమకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పారని పోలీస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో... హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్ధీఖ్ తో పాటు ఆయన కుమారుడు ఉంటారని.. ఇద్దరినీ షూట్ చేయమని తమకు ఆదేశాలు అందాయని చెప్పినట్లు తెలుస్తోంది.
ఒక వేళ ఇద్దరినీ కాల్చడానికి వీలుకాని పక్షంలో.. ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని తమకు ఆదేశాలు ఇచ్చినవాళ్లు చెప్పారని వారు విచారణలో వెల్లడించినట్లు కథనాలొస్తున్నాయి. కాగా... జిషన్ సిద్ధిఖ్ కాంగ్రెస్ టిక్కెట్ పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది!
కాగా బాబా సిద్ధిఖ్ ను ముంబైలోని కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరగపడంతో ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ సమయంలో... తమకు అందిన ఆదేశాల మేరకు సిద్ధిఖ్ కుమారుడిని కూడా చంపమన్నారని చెప్పారని తెలుస్తోంది!