అసెంబ్లీ బరిలో లక్ష్మీపార్వతి... వైసీపీ ట్విస్ట్ ...!
ఉమ్మడి అనంతపురం లోని హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 27 July 2023 4:00 AM GMTఅన్నగారు ఎన్టీఆర్ సతీమణి.. ప్రస్తుతం ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌గా ఉన్న లక్ష్మీ పార్వతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. పదవులతో నిమిత్తం లేకుండా ఆమె పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలు.. కావడం.. అన్నగారి సతీమణి గా ఆమె ప్రచారంలో ఉండడంతో ఇప్పుడు రాజకీయంగా ఆమె పోటీకి రెడీ అవుతున్నారట.
నిజానికి అన్నగారు జీవించి ఉన్న కాలం లోనే రాజకీయాల్లో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అనేక మంది నాయకుల కు ఆమె ప్రోత్సహంతోనే టికెట్లు లభించాయని టీడీపీ లో ఒక టాక్ కూడా ఉంది. తర్వాత.. టీడీపీ లో తలెత్తిన సంక్షోభంతో ఎన్టీఆర్ టీడీపీ ని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే.. ఆమె ఓడిపోయారు. తర్వాత.. పార్టీని పక్కనపెటి వైసీపీ కి అనుకూలంగా మారిపోయారు. ఇక, అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల కు దూరంగా ఉంటున్నారు.
అయితే.. గత ఎన్నికల్లోనే ఆమె పోటీకి రెడీ అయ్యారనే టాక్ వినిపించింది. గతం లో ఎన్టీఆర్ గెలిచిన స్థానం లో ఒక్కటైనా దక్కించుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేది ఆమె చిరకాలం వాంఛ. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తన కోరిక ను సీఎం జగన్ దగ్గర ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడు.. ఆమెకు ఆఫర్‌తగిలే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం లోని హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక్కడ గతం లో అన్నగారు విజయం దక్కించుకున్నారు. గత రెండు ఎన్నికల్లో అన్నగారి కుమారుడు, నటసింహం నందమూరి బాలయ్య విజయం దక్కించుకుంటున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే.. ఎన్టీఆర్ సింపతీ కూడా తోడవుతుందని అంటున్నారు.
నిన్న మొన్నటి వరకు బాలయ్య విషయం లో సానుకూలంగా ఉన్న జ.గన్ కూడా ఇటీవల కాలంలో ఆయన ను కూడా రాజకీయంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం టికెట్ ను లక్ష్మీపార్వతికి కేటాయించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.