Begin typing your search above and press return to search.

లిస్ట్ రిలీజ్ చేస్తే తమ్ముళ్ళు బరస్ట్ అవుతారా...!?

ఎంత మంది సర్దుకుంటారు ఎంతమంది బరస్ట్ అవుతారు అన్న అంచనాలు అధినాయకత్వానికే అందడంలేదు అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:30 PM GMT
లిస్ట్ రిలీజ్ చేస్తే తమ్ముళ్ళు బరస్ట్ అవుతారా...!?
X

ఇప్పటిదాకా వైసీపీలో అలకలు అసంతృప్తులు అన్న ఎపిసోడ్ సాగింది. ఇపుడు టీడీపీ వంతు అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ సీన్ ఉంది. ఇప్పటికే కొందరు నేతలు అధికార వైసీపీ వైపు వస్తున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి వచ్చేశారు. రాయలసీమ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే తనకు సీటు రాదని తెలిసి ఏకంగా బాబు ఫోటోను లేకుండా అనుచరులతో మీటింగ్ నిర్వహిస్తున్నారు.

రాయలసీమలో చాలా పెద్ద కుటుంబాలు పొలిటికల్ గా పలుకుబడి కలిగినవి కూడా ఇపుడు ఫ్యామిలీ ప్యాకేజ్ లేదు అని చెప్పడంతో బాబు మీద గుర్రు మీద ఉన్నాయని టాక్. టీడీపీలో కొత్త ముఖాలు గెలుపు గుర్రాలు అంటూ బాబు గతంలో ఎన్నడూ చూడని లిస్ట్ ప్రిపరేషన్ లో ఉన్నారని అంటున్నారు. అలాగే ఈసారి బాబు మొహమాటాలకు పోవడం లేదు.

ఆ విషయంలో ఆయన జగన్ నే అనుసరిస్తున్నారు అని అంటున్నారు. నాయకుల కంటే పార్టీ క్యాడర్ ముఖ్యం అని బాబు ఆలోచిస్తున్నారుట. అలాగని తానుగా ఎవరినీ వదులుకోవడంలేదు. కానీ టికెట్ రానివారు మాత్రం గతంలో మాదిరిగా బాబు హామీలతో సర్దుకుపోయే సూచనలు అయితే లేవు అని అంటున్నారు.

ఎందుకంటే బాబుకు టీడీపీకి మాత్రమే ఈసారి ఎన్నికలు కీలకం కాదు ఆ పార్టీని ఆశ్రయించి ఉన్న వారికి కూడా అంతే లెక్క అంటున్నారు ఒక్కసారి కానీ మిస్ అయితే రేపటి రోజున రాజకీయం తారు మారు అయితే జాతకాలే మొత్తం మారిపోతాయని కీలక నేతలు అంతా భావిస్తున్నారుట.

అందుకే ఈసారి తమ్ముళ్లలో ఎంత మంది నచ్చెచెబితే వింటారు. ఎంత మంది సర్దుకుంటారు ఎంతమంది బరస్ట్ అవుతారు అన్న అంచనాలు అధినాయకత్వానికే అందడంలేదు అంటున్నారు. మరో వైపు చూస్తే పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికి బాబు ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్లు కన్ ఫర్మ్ చేశారు. అలాగే మరికొంతమందికి అలాగే ఇస్తారు అని అంటున్నారు.

పొత్తులలో జనసేన బీజేపీకి సీట్లు చాలా వరకూ పోతే అపుడు తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మాత్రం చర్చనీయాంశం అవుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని ఇస్తున్న హామీలు కూడా తమ్ముళ్లకు ఎంతవరకూ చెవికెక్కుతాయన్నది ప్రశ్నగానే ఉంది అని అంటున్నారు.

ఎందుకంటే ఈసారి హోరా హోరీ పోరు ఉంటుంది. గెలుపు అన్నది ఆఖరు ఓటు ఈవీఎం మిషన్ నుంచి బయటకు వచ్చేవరకూ తెలియని టెన్షన్ గా ఉంటుందని అంటున్నారు. ఏదైనా జరగవచ్చు. బొమ్మ బొరుసు కావచ్చు అన్నదే తమ్ముళ్ళతో పాటు తలపండిన రాజకీయ నేతల మాటగా ఉంది. లిస్ట్ మాత్రం టీడీపీ రిలీజ్ చేస్తే అగ్గి రవ్వలు చాలానే బయటకు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.