వాళ్ల ఓటు వారికే వేసుకోని ప్రముఖుల జాబితా పెద్దదే!
ఇదో సిత్రమైన సన్నివేశం. ఎన్నికల వేళ.. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటు వేయాలని వేలాది మందికి అప్పీలు చేస్తుంటారు.
By: Tupaki Desk | 17 Nov 2023 4:30 PM GMTఇదో సిత్రమైన సన్నివేశం. ఎన్నికల వేళ.. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటు వేయాలని వేలాది మందికి అప్పీలు చేస్తుంటారు. మరి.. అలా అడిగే అభ్యర్థుల్లో కొందరు ప్రముఖులు తమ ఓటు తమకు వేసుకోలేని సిత్రమైన పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం.. ఆయా ప్రముఖ నేతలు తాము పోటీ చేసే నియోజకవర్గం ఒకటైతే.. వారికి ఓటు ఉన్న నియోజకవర్గం మరొకటిగా ఉండటమే దీనికి కారణమని చెప్పాలి.
ఈ విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కొని ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులకు ఇలాంటి పరిస్థితే ఉంది. అంతేనా.. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణ అధికార పక్షానికి చెందిన ప్రముఖ నేతలకే కాదు.. కాంగ్రెస్.. బీజేపీ.. మజ్లిస్ పార్టీకి చెందిన వారికి కూడా ఉంది. ఇదంతా చూస్తే.. అదే పనిగా తమకు ఓటు వేయాలని ప్రచారం చేసే ప్రముఖులు.. తమకంటూ ఓటు మాత్రం వేరే చోట ఉండటం.. పోటీలో ఉన్న వారు తమ ఓటును తమకు వేసుకోలేని విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే తీసుకుంటే ఆయనకు సిద్దిపేటలో ఓటు ఉండగా.. తనకు ఓటు లేని గజ్వేల్.. కామారెడ్డి రెండుచోట్ల పోటీ చేస్తుననారు. రేవంత్ విషయానికి వస్తే ఆయనకు ఓటు కొడంగల్ లో ఉంది.అయితే.. రేవంత్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొడంగల్ తో పాటు ఆయన ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక నేత బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆయనకు హుజూరాబాద్ లో ఓటు ఉండగా.. ఆయన మాత్రం గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న కేసీఆర్.. రేవంత్.. ఈటల ముగ్గురు రెండేసి చోట్ల పోటీ చేస్తుండటం ఒక ఎత్తు అయితే.. ఈ ముగ్గురిలో ఇద్దరికి తాము పోటీ చేస్తున్న ఒక నియోజకవర్గంలో ఓటు లేదు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం తాను పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ఓటు లేకపోవటం గమనార్హం. ఇదే తరహాలో తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఓటు లేని ప్రముఖుల విషయానికి వస్తే..
అధికార బీఆర్ఎస్ లో..
కేసీఆర్
కేటీఆర్
హరీశ్ రావు
దయాకర్రావు
మల్లారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి
తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావు గౌడ్
మర్రి రాజశేఖర్ రెడ్డి
పల్లా రాజేశ్వర్ రెడ్డి
కడియం శ్రీహరి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే
రేవంత్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి
కొండా సురేఖ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
పొంగులేని శ్రీనివాసరెడ్డి
గడ్డం వినోద్
గడ్డం వివేకానంద
అజారుద్దీన్
మధు యాష్కీ గౌడ్
బీజేపీ అభ్యర్థుల విషయానికి వస్తే
ఈటల రాజేందర్
అర్వింద్
రాణి రుద్రమ
మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే..
అక్బరుద్దీన్ ఓవైసీ