పెద్దలు గ్రామంలో.. పిల్లలు పట్టణంలో.. మనవలుగా తోలు బొమ్మలు!
చదువుల కోసమనీ, ఉపాధి ఉద్యోగాల కోసమని యువత గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లడం కామన్ అయిపోయిన రోజులివి! ఈ క్రమంలో... అలా వెళ్లిన కొంతమంది ఇక పూర్తిగా పట్టణాల్లోనే స్థిరపడిపోతున్నారు.
By: Tupaki Desk | 31 Oct 2024 4:08 AM GMTచదువుల కోసమనీ, ఉపాధి ఉద్యోగాల కోసమని యువత గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లడం కామన్ అయిపోయిన రోజులివి! ఈ క్రమంలో... అలా వెళ్లిన కొంతమంది ఇక పూర్తిగా పట్టణాల్లోనే స్థిరపడిపోతున్నారు. మరికొంతమంది పండగలు, ఫంక్షన్లప్పుడు తళుక్కు మంటుంటారు. ఈ క్రమంలో జపాన్ లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఓ గ్రామం వార్తల్లో నిలిచింది.
పిల్లల జీవితాలు బాగుండాలని వారిని గ్రామాల నుంచి పట్టణాలకు పంపించారు జపాన్ లోని ఇచినోనో లోని పెద్దలు. దీంతో... ఆ గ్రామంలో ఇప్పుడు వృద్ధులు మాత్రమే మిగిలారని అంటున్నారు. వారి పిల్లలు, పిల్లల పిల్లలు పట్టణాలకే మరిమితమైపోయారు! దీంతో... ఆ గ్రామంలోని వృద్ధులు పిల్లల రూపాల్లో తోలు బొమ్మలు వంటివి చేసుకున్నారు.
అవును... జపాన్ లోని ఓ చిన్న గ్రామమైణ ఇచినోనోలో బొమ్మలు దైనందిన జీవితంలో భాగమయ్యాయి.. ఆ గ్రామంలోని నిశబ్ధ సమజానికి కాస్త సందడిని జోడిస్తున్నాయి. వృద్ధాప్యంలో ఉన్నవారిలో కొంత చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గ్రామస్థులు ఇలా తోలు బొమ్మలు వంటివి రూపొందించారు.
ఈ ఇచినోనోనే కాదు.. జపాన్ లోని గ్రామీణ ప్రాంతాలు గణనీయమైన జనాహా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన గ్రామంలోని వృద్ధులు... తమ కంటే తోలు బొమ్మల సంఖ్య ఎక్కువగా ఉందనే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో... తమ పిల్లలు ఇలాంటి మారుమూల ప్రారంతాల్లో ఇరుక్కుపోతే.. వారికి పెళ్లిల్లు కూడా అవ్వవేమోనని చాల భయపడ్డాము. అందుకే వారు బయటకు వెళ్లారు. కానీ... తిరిగి రాలేదు! అక్కడే ఉద్యోగాలు పోందారు, అక్కడే స్థిరపడిపోయారు.. ఇక్కడ మేము విలువ చెల్లిస్తున్నాము అని ఓ వృద్ధురాలు వ్యాఖ్యానించారు!
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఓ కొత్త జంట ఇటీవల మహానగరాన్ని వదిలి గ్రామానికి వెళ్లి.. ప్రశాంత వాతావారణంలో బ్రతకాలని ఫిక్సయ్యారంట! కోవిడ్ 19 మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ పని ప్రారంభమైనప్పుడు రీకటో (33), తోషికీ కటో (31) అనే జంట తిరిగి గ్రామానికి వచ్చేశారు.
ఈ జంటకు కురానోసుకే కటో అనే కుమారుడు జన్మించాడు. అయితే... సుమారు రెండు దశాబ్ధాల తర్వతా ఆ గ్రామంలో జన్మించిన మొదటి శిశువు అతడే కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆ బిడ్డే ఆ గ్రామంలో సెలబ్రెటీ.
ఈ విషయాలపై స్పందించిన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా... ఇటువంటి ప్రాంతలకు సబ్సిడీలను పెంచడం వంటి విధానాలతో గ్రామీణ జపాన్ ను పునరుజ్జీవింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో రికటో, తోషికీ కటో వంటి గ్రామస్తులు ఇచినోనోను నిలబెట్టాలని ఆశిస్తున్నారు. లేదంటే.. మరికొంతకాలంలో ఈ గ్రామం కలాగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది!