Begin typing your search above and press return to search.

పిల్లలకు ఈ పేర్లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు!

ఆ సంగతి అలా ఉంటే... ప్రపంచంలోని పలు దేశాల్లో కొన్ని పేర్లు నిషేధించారు. ఆ పేర్లు పెడితే జైలు శిక్ష అనుభవించాల్సి రావొచ్చు!

By:  Tupaki Desk   |   7 Dec 2024 6:08 AM GMT
పిల్లలకు ఈ పేర్లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు!
X

సాధారణంగా ఏ ఇంటిలోనైనా పిల్లలు పుడితే.. వారికి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు.. తీవ్ర చర్చలు నడుపుతుంటారు. ఈ సందర్భంగా రకరకాల పేర్లు, అవి పెట్టడానికి గల కారణాలు వివరిస్తుంటారు. ఇంట్లో పెద్ద వాళ్ల పేర్లు కలిసేలా చాలా మంది పెడుతుంటారు. అక్షరాల సెంటిమెంట్ ఉన్నవారిది మరో కథ!

అయితే... ఫైనల్ గా రెండు పేర్లు సెట్ చేసుకుని.. ఒకటి ముందు పేరు, మరొకటి అసలు పేరుగా ఫైనల్ చేస్తుంటారు చాలా మంది! ఈ సమయంలో ఆన్ లైన్ లో సెర్చ్ చేసేవారు కొందరైతే.. సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించేవారు ఇంకొందరు! ఆ సంగతి అలా ఉంటే... ప్రపంచంలోని పలు దేశాల్లో కొన్ని పేర్లు నిషేధించారు. ఆ పేర్లు పెడితే జైలు శిక్ష అనుభవించాల్సి రావొచ్చు!

అవును... పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో పలు దేశాల్లో పలు కండిషన్స్ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు కొన్ని పేర్లను పిల్లలకు పెట్టకుండా నిషేధించాయి. దీంతో... పిల్లలకు నిషేధించిన ఆ పేర్లు పెట్టే అవకాశం లేదు. ప్రధానంగా జీసస్ క్రైస్ట్ పేరు పెడితే.. అది దైవదూషణగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆ పేర్లు, దేశాల వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

అమెరికాలో పలు పేర్లు చట్టవిరుద్ధంగా పరిగణించబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా.. శాంతా క్లాజ్, మెజెస్టీ, రోమన్ నెంబర్ 3 (III), మెస్సియా అనే పేర్లు ఉన్నాయి. ఇదే సమయంలో... దైవ దూషణలకు సంబంధించిన వాదనల నడుమ "జీసస్ క్రైస్ట్" అనే పేరు పెట్టుకోవడానికి అమెరికాలో అనుమతి లేదు!

ఇదే సమయంలో... ఒకప్పుడు యూరప్ లో ప్రసిద్ధి చెందిన పేరు, మిలియన్ల మందిని చంపిన జర్మన్ నాయకుడి పేరు "అడాల్ఫ్ హిట్లర్" పిల్లలకు పెట్టడం జర్మనీతో పాటు.. మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్ మొదలైన దేశాలో నిషిద్ధం!

ఇక.. భారత్ తో పాటు ఇరాన్ మూలాలున్న "ఆర్యన్" అనే పేరును పిల్లలకు పెట్టడం అనేక దేశాల్లో చట్ట విరుద్ధం! "మెటాలి" అనే పేరు స్వీడన్ లో నిషేద్ధం. ఇదే క్రమంలో... "మంకీ" అనే పేరు డెన్మార్క్ లోనూ.. "ఒసామా బిన్ లాడెన్" అనే పేరు జర్మనీలోనూ.. "థోర్" అనే పేరు పోర్చుగల్ లోనూ.. "సైనైడ్" అనే పేరు యూకేలోనూ చట్ట విరుద్ధం.

ఇదే సమయంలో... "ఐకియా" అనే పేరు స్వీడన్ లోనూ.. "జుడాస్" అనే పేరు స్విట్జర్లాండ్ లోనూ.. "అకుమా / డెవిల్" అనే పేరు జపాన్ లోనూ.. "చౌటో / స్మైలీ హెడ్" అనే పేరు మలేషియాలోనూ.. "సెక్స్ ఫ్రూట్", "లూసీఫర్" అనే పేరు న్యూజిలండ్ లోనూ.. "స్పినాచ్", "ప్రెసిడెంట్" అనే పేరు ఆస్ట్రేలియాలోనూ చట్ట విరుద్ధం!

అదేవిధంగా... "సున్తీ", "రోబో కాప్" అనే పేర్లు మెక్సిలో నిషేదం కాగా... పనివారంలోని చివరి రోజైన "ఫ్రైడే / వెనెర్డీ" అనే పేరు ఇటలీలో చట్ట విరుద్ధంగా ఉన్నాయి. ఈ దేశాల్లో పిల్లలకు పైన పేర్కొన్న పేర్లు పెడితే చట్ట పరమైనచర్యలకు బాధ్యులవుతారు!