Begin typing your search above and press return to search.

చైనీయుల్నితిట్టిపోస్తాం కానీ వాస్తవం ఇలా ఉందట!

చైనీయుల్లో ఎక్కువమంది కుక్క.. పిల్లి.. ఎలుక మాంసాన్నితినేందుకు ఇష్టపడరని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 11:30 PM GMT
చైనీయుల్నితిట్టిపోస్తాం కానీ వాస్తవం ఇలా ఉందట!
X

కొన్ని ఆలోచనలు మనసును ఆక్రమించిన వేళ.. వారిపై అప్పటికే మనకున్న భావాలకు తగ్గట్లుగా వారి గురించి ఫీల్ అవుతుంటాం. చైనా అంటే మనకు కోపం. చైనీయులంటే మనకు అనుమానం. వారి బిహేవియర్ విషయంపై సందేహాలు ఉంటాయి. కానీ.. విదేశాల్లో పని చేసే మనోళ్లను.. చైనీయుల వ్యవహారశైలి ఎలా ఉంటుంది? అన్నప్పుడు వారెప్పుడూ పెద్దగా కంప్లైంట్ చేయటం కనిపించదు. ఇక.. చైనీయుల తిండి దగ్గరకు వచ్చేసరికి.. వారు ఏదైనా తినేస్తారంటూ చులకన చేసి మాట్లాడే వారు చాలామంది కనిపిస్తారు.

కానీ.. చైనీయుల్లో కూడా ఎక్కువ మంది పిల్లి.. కుక్క.. ఎలుక.. ఇలాంటి కొన్ని జీవుల మాంసాన్ని తినేందుకు ఆసక్తి చూపటం ఉండదు. అయితే.. మనకు మాదిరే అక్రమ రవాణాతో పాటు.. వడ్డించే మాంసం విషయంలో కొందరు చేసే దుర్మార్గాలపై చైనీయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్యన జియాంగ్ షి ప్రావిన్స్ లో ఒక కాలేజీ విద్యార్థి తినే ఆహారంలో ఎలుక తల కనిపించింది. దీంతో.. ఆ విద్యార్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. కాలేజీ యాజమాన్యం తొలుత దాన్ని బాతు మాంసంగా వాదించింది. అనంతరం విద్యార్థి చెప్పినట్లే అది ఎలుక తల అన్న విషయాన్ని అంగీకరించారు.

చైనీయుల్లో ఎక్కువమంది కుక్క.. పిల్లి.. ఎలుక మాంసాన్నితినేందుకు ఇష్టపడరని చెబుతున్నారు. తాజాగా వెయ్యి పిల్లుల్ని వధించేందుకు సిద్ధమైన ఉదంతాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. పిల్లుల అక్రమరవాణాపై చైనా సోషల్ మీడియా వీబోలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అక్రమంగా వధించేందుకు సిద్ధమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెల్లుబికాయి. ఆహారపరిశ్రమల్లో తనిఖీలు మరింత పెంచాలని వారు కోరుతున్నారు.

జంతు సంరక్షణ చట్టాలు ఎప్పుడు వస్తాయి? పిల్లులు.. కుక్కల ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు స్పందిస్తూ.. ఇకపై తాను బయట హోటల్స్.. రెస్టారెంట్లలో మాంసాన్ని తినాలని అనుకోవటం లేదన్న నిర్ణయాన్ని వెల్లడించటం కనిపిస్తుంది. అక్రమంగా రవాణ చేస్తున్న వెయ్యి పిల్లుల్నిఅధికారులు రక్షించటంపై అభినందనలు వ్యక్తం కావటమే కాదు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చైనాలో 600 గ్రాముల పిల్లి మాంసం రూ.51 రూపాయిలుగా చెబుతున్నారు. ఇంత చౌక ధరకు పిల్లి మాంసం లభిస్తున్న నేపథ్యంలో పలువురు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటే.. మరికొందరు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని.. వేరే మాంసంగా చెప్పి విక్రయిస్తారని చెబుతున్నారు. చైనాలోని పలువురు అక్రమార్కులు పిల్లుల మాంసాన్నిపోర్క్.. మటన్ సాసేజ్ స్ గా అమ్ముతుంటారని.. దీంతో.. ప్రజలు సైతం పొరపాటుగా వాటిని కొనేస్తుంటారని చెబుతారు. భారీ ఎత్తున పిల్లుల అక్రమ రవాణా కుట్రను అధికారులు భగ్నం చేసిన వేళ.. చైనా సోషల్ మీడియాలో పెల్లుబికిన అగ్రహం చూస్తే.. చైనీయులు సైతం ఏ మాంసాన్ని పడితే ఆ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా లేరన్న విషయం అర్థమవుతుంది.