తెలంగాణా మూడ్ : ఒక్క చాన్స్ ఇద్దాం...!
అదెలా అంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సింపులు మెజారిటీ అయినా బీయారెస్ కి దక్కుతుంది అని.
By: Tupaki Desk | 18 Nov 2023 4:13 PM GMTతెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ గా 12 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇలా చూస్తే అలా అయిపోతాయి ఆ కొద్ది రోజులు. ఇదిలా ఉంటే ప్రజల మూడ్ ఎలా ఉంది అన్నదే ఇపుడు ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు ఉన్న పరిస్థితితో పోలిస్తే ఇపుడు డ్రాస్టిక్ చేంజి కనిపిస్తోంది అని అంటున్నారు. అదెలా అంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సింపులు మెజారిటీ అయినా బీయారెస్ కి దక్కుతుంది అని.
అయితే గడచిన కొంతకాలంగా సీన్ మారుతోంది అని అంటున్నారు. ఒక్క చాన్స్ కాంగ్రెస్ కి ఇద్దాం అన్నది జనం భావనగా ఒక తాజా అధ్యయనం వెల్లడిసోంది అని అంటున్నారు. కాంగ్రెస్ కి ఇపుడు ఉన్న పరిస్థితుల్లో మొగ్గు ఉందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 45 కి తగ్గవని అంటున్నారు.
అదే విధంగా అధికార బీయారెస్ ని చూసుకుంటే కచ్చితంగా గెలిచే సీట్లు పాతిక మించవని అంటున్నారు. ఇక మజ్లీస్ పార్టీకి ఏడు సీట్లు గ్యారంటీ అంటున్నారు. అలాగే బీజేపీకి అయిదు సీట్లు వస్తాయని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మరో 37 సీట్లలో హోరాహోరీ పోరు సాగుతున్నట్లుగా ఈ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.
ఈ సీట్లలో కనుక ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే అధికార పీఠం అని అంటున్నారు. ఈ విషయం కనుక చూస్తే చాలా ఇంటరెస్టింగ్ మ్యాటర్ తెలుస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే కాంగ్రెస్ కి అధికారం దక్కాలంటే సింపుల్ మెజారిటీ మరో 15 సీట్లు సరిపోతాయి. కచ్చితంగా గెలిచే నలభై అయిదు సీట్లకు ఆ పదిహేను సీట్లు తెచ్చుకుంటే చాలు తెలంగాణాలో అధికారం కాంగ్రెస్ పరం అవుతుంది.
అదే బీయారెస్ అరవి సీట్లకు చేరువ కావాలంటే కచ్చితంగా 35 సీట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్ 37 సీట్లలో 35 సీట్లు రావడం అంటే హోరా హోరీ పోరులో నూరు శాతం సీట్లను గెలవడం అన్న మాట. అది అసలు ఏ విధంగానూ సాధ్యపడుతుందా అన్నదే పెద్ద ప్రశ్న.
అయితే సామ దాన భేద దండోపాయలు ఎటూ ఉంటాయి. ముఖ్యంగా ధన ప్రవాహం ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పనిచేస్తుంది అని అంటున్నారు. దాంతో ఇలాంటి కీలకమైన కష్టమైన నియోజకవర్గాలలో సీట్లను సాధించేందుకు అన్ని రకాలైన ప్రయోగాలను వాడుతారు అని అంటున్నారు.
అయితే జనం మూడ్ ఒక్కసారి ఫిక్స్ అయితే మాత్రం మార్చడం ఎవరి తరం కాదని కూడా అంటున్నారు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని ప్రలోభాలు ఓటర్లను పెట్టినా చివరికి మాత్రం ఓటరు తాను అనుకునేది చేస్తారు అన్నది చాలా కాలంగా రుజువు అవుతున్న విషయం. ఏది ఏమైనా చూస్తే కనుక మరి కొద్ది రోజులలో పోలింగ్ కి వెళ్ళబోతున్న తెలంగాణాలో కాంగ్రెస్ కే కాస్తా అనుకూలత ఉంది అని తాజా అధ్యయనం చెబుతోంది అంటున్నారు.
ఇప్పటికే చాలా అధ్యయనాలు ఈ విధంగానే తీర్పు ఇస్తూ వచ్చాయి. ఇక బీజేపీ ఏ మాత్రం ఎత్తిగిల్లడంలేదని కూడా ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. అదే విధంగా మజ్లిస్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ ఉండబోదని అంటున్నారు. రెండు సార్లు తెలంగాణాలో అధికారంలో ఉండడం ఎమ్మెల్యేలలో క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్లనే బీయారెస్ మీద జనం ప్రతికూలతను పెంచుకుంటున్నారు అని అంటున్నారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు కొంత సానుభూతి సానుకూలత కనిపిస్తున్నాయి. తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఒక్క చాన్స్ ఇస్తే తప్పేంటి అన్న భావన కూడా ఏర్పడింది. దీంతోనే కాంగ్రెస్ అమాంతం అలా తన గ్రాఫ్ పెంచుకుంటోంది. అద్భుతాలు సహజంగా భారతీయ ఎన్నికలలో జరగవు. అందువల్ల ఇపుడున్న ట్రెండ్ అలాగే కొనసాగితే హస్తం పార్టీకే చాన్స్ అని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.