Begin typing your search above and press return to search.

పెరుగుతున్న ఆయుర్దాయం.. అధ్య‌య‌నం వెల్ల‌డి

ప్ర‌పంచ వ్యాప్తంగా.. పురుషులు, మ‌హిళ‌ల ఆయుర్దాయం పెరుగుతున్న‌ట్టు తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   18 May 2024 1:30 PM GMT
పెరుగుతున్న ఆయుర్దాయం.. అధ్య‌య‌నం వెల్ల‌డి
X

నా ఆయుష్సు కూడా పోసుకుని మ‌రిన్నేళ్లు జీవించు! అనే మాట మ‌నం త‌ర‌చుగా వింటుంటాం. ఇప్పుడు ఇలాంటివి అవ‌స‌రం లేదు! ఎవ‌రి ఆయుర్దాయ‌మైనా పెరుగుతోందట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా.. పురుషులు, మ‌హిళ‌ల ఆయుర్దాయం పెరుగుతున్న‌ట్టు తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. పురుషుల వ‌య‌సు 5 సంవ‌త్స‌రాలు, మ‌హిళ‌ల వ‌య‌సు 4 ఏళ్లు పెరుగుతున్న‌ట్టు తెలిపింది.

2022-2050 మ‌ధ్య కాలంలో ఈ మార్పు క‌నిపిస్తోంద‌ని.. లాన్సెట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించిన ఓ అధ్య‌య‌నం తెలిపింది. అంతేకాదు..చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయుర్దాయం త‌క్కువ‌గా ఉన్నా య‌ని భ‌య‌ప‌డుతున్న దేశాల్లో ఈ పెంపుద‌ల న‌మోద‌వుతున్న‌ట్టు తెలిపింది. ఇది ఇత‌ర దేశాల్లోనూ క‌నిపిస్తున్న‌ట్టు అధ్య‌య‌నం చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం క‌రోనా అనంత‌రం.. ప్ర‌పంచ వ్యాప్తంగా రోగ‌నిరోధ‌క శ‌క్తికి సంబంధించిన ఔష‌ధాల వినియోగం పెరిగిన విష‌యం తెలిసిందే.

ఇలా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో ఆ ప్ర‌భావం ఆయుర్దాయంపైనా ప‌డిన‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీనివ‌ల్ల మాన‌వ జీవ‌న కాలం పెరుగుతోంద‌ని అంచ‌నా వేశారు. దీంతో పాటు ఆయుర్దాయ అస‌మాన‌త‌లు కూడా త‌గ్గుతున్న‌ట్టు తెలిపారు. ఈ విష‌యాన్ని అమెరికా రాజ‌ధాని వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌ డైరెక్టర్‌ క్రిస్‌ ముర్రే పేర్కొన్నారు.

కీలక విష‌యాలు ఇవీ..

+ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా జీవించే వారి ఆయుర్దాయం 2.6 సంవత్సరాలు పెరుగుతోంది.

+ 2022లో 64.8 ఏళ్లు ఉండగా 2050లో 67.4 సంవత్సరాలకు చేరనుంది.

+ 2050 నాటికి భారత్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 75 ఏళ్లుగా ఉండ‌నుంది.

+ మహిళల ఆయుర్దాయం 80 ఏళ్లకు చేర‌నుంది.

+ భారత్‌లో ఆరోగ్యంగా జీవించే వారి ఆయుర్దాయం పురుషులు, మహిళల్లో స‌మానంగా 65 ఏళ్లు ఉండ‌నుంది.