Begin typing your search above and press return to search.

300 రూపాయల లిప్ స్టిక్ అంతపని చేసింది!

ఒక మహిళా డాక్టర్ తాజాగా ఆన్ లైన్ లో ఒక లిప్ స్టిక్ ఆర్డర్ చేశారు. దాని ఖరీదు ఆఫర్ లో రూ. 300 అని ఉంది. ఆమె ఫోన్ కు ఆర్డర్ చేసిన లిప్ స్టిక్ కు డెలివరికి సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 2:27 PM GMT
300 రూపాయల లిప్  స్టిక్  అంతపని చేసింది!
X

తాజాగా ఒక మహిళా డాక్టర్ రూ. 300 పెట్టి లిప్ స్టిక్ ఆర్డర్ చేశారు. ఆ ఒక్క పని కొంపముంచినంత పనిచేసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో... ఆన్ లైన్ లో షాపింగ్ అనంతరం ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో కొన్ని వ్యవహారాల్లో జరిగే చీటింగ్ లు ఏ స్థాయిలో ఉంటాయో అనుభవంలోకి వచ్చింది పాపం! దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది!

అవును... ఒక మహిళా డాక్టర్ తాజాగా ఆన్ లైన్ లో ఒక లిప్ స్టిక్ ఆర్డర్ చేశారు. దాని ఖరీదు ఆఫర్ లో రూ. 300 అని ఉంది. ఆమె ఫోన్ కు ఆర్డర్ చేసిన లిప్ స్టిక్ కు డెలివరికి సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. అనంతరం కస్ట్ మర్ కేర్ అని కాల్ కూడా వచ్చింది.. లిఫ్ట్ చేసి వివరాలు ఎంటర్ చేసేసరికి బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది!

వివరాళ్లోకి వెళ్తే... ముంబైకు చెందిన ఒక మహిళా డాక్టర్ ఆన్ లైన్ లో ఓ లిప్ట్ స్టిక్ ఆర్డర్ చేసింది. అలా ఆర్డర్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆర్డర్ వచ్చిందంటూ కాల్ వచ్చింది. అనంతరం కొన్ని వివరాల కోసం తమ కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిథితో మాట్లాడాలని ఆమె ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మహిళా డాక్టర్ కొరియర్ కంపెనీ నంబర్‌ ను సంప్రదించారు.

ఆ సమయంలో అటువైపు నుంచి రెగ్యులర్ గా వచ్చే స్పందన వచ్చింది. నమస్కారం.. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను.. అని అడగారు. ఈమె వివరాలు చెప్పారు... దానికి సదరు వ్యక్తి ఆర్డర్ హోల్డ్‌ లో ఉంచబడిందని.. దానిని కన్ ఫాం చేయడం కోసం రెండు రూపాయలు ఆన్ లైన్ లో పంపిస్తే ప్రొడక్ట్ రిలీజ్ అయిపోతుందని తెలిపాడు. దాని కోసం బ్యాంక్ వివరాలు ఫిల్ చేయాలని ఓ వెబ్ లింక్ మొబైల్ కి పంపించారు!

అక్కడితో ఆగని వారి పెర్ఫార్మెన్స్... మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని చెప్పారు. దీంతో ఆమెను మంత్రిస్తున్నారన్న విషయం గ్రహించలేకపోయిన మహిళా డాక్టర్ ఆన్ లైన్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేశారు. దీంతో ఒక యాప్ డౌన్ లోడ్ అయిపోయింది. అప్పటికీ గ్రహించలేని ఆమె... మరోసారి ఆ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేశారు. కట్ చేస్తే... బిగ్ డ్యామేజ్ జరిగింది.

ఇందులో భాగంగా... ఇటీవల ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.95 వేలు.. రూ.5 వేలు కట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. అప్పటికి ఆమెకు అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయినట్లు తెలుసుకుని, సైబర్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు! ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో అస్సలు అశ్రద్ధ ఉండకూడదని హెచ్చరిస్తున్నారు!