తమ్ముళ్ల తప్పులు: మద్యం సిండికేట్.. !
మరీముఖ్యంగా తాజాగా ప్రకటించిన మద్యం దుకాణాల విషయంలో తమ్ముళ్లు చెలరేగుతున్నారన్న వార్తలు పార్టీ అధిష్టానం వరకు కూడా చేరిపోయింది.
By: Tupaki Desk | 7 Oct 2024 6:30 AM GMTఏపీలోని కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీకి ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కీలక విషయాల్లో జోక్యం వద్దని చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. తమ్ముళ్లు మాత్రం వి నిపించుకోవడం లేదు. ఇసుక విషయం నుంచి మద్యం వరకు కూడా తమ్ముళ్ల జోక్యం ఎక్కువగానే ఉంది. మరీముఖ్యంగా తాజాగా ప్రకటించిన మద్యం దుకాణాల విషయంలో తమ్ముళ్లు చెలరేగుతున్నారన్న వార్తలు పార్టీ అధిష్టానం వరకు కూడా చేరిపోయింది.
క్షేత్రస్థాయిలో మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 వేల మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని వీటిని ప్రైవేటు ఆధ్వర్యంలో నడిపించాలని సర్కారు యోచిం చింది. దీంతో 2014-19 మధ్య ఉన్న మద్యం విధానాన్ని తిరిగి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆయా షాపులకు టెండర్లు ఆహ్వానించింది. ఒకప్పుడు ప్రభుత్వం ఇలా టెండర్లు పిలవగానే కుప్పలు కుప్పలు దరఖాస్తులు వచ్చేవి. కానీ, ఈ సారి ఆ ఊపు కనిపించడం లేదు.
మద్యం దుకాణాలకు 3 రోజుల్లో 3 వేల దరఖాస్తులు మాత్రమే అందాయి. రాష్ట్రంలో 3,396 మద్యం దుకా ణాలు(వైన్స్), 12 స్మార్ట్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే దరఖా స్తులను ఆహ్వానించగా.. చాలా చప్పగా పరిస్థితి కనిపించింది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు మూడు వేలకు పైగా మాత్రమే దరఖాస్తులు అందాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయి. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరాయి.
అయితే.. నూతన మద్యం విధానం ఇంత చప్పగా సాగడానికి కారణం ఏంటి? ఎందుకు అసలు ఊపు లేదు? అనే విషయాలు పరిశీలిస్తే.. క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వ్యాపారులను సిండికేట్ చేసి.. ఎమ్మెల్యేలే చక్రం తిప్పుతున్నారు. దీంతో వారు కోరుకున్నట్టుగా ముడుపులు ఇచ్చుకోలేని వ్యాపారులు తప్పుకోవడమే మేలు అన్నట్టుగా మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అందుకే.. మద్యం కోసం షాపుల ఏర్పాటుకు పెద్దగా స్పందన కనిపించడం లేదని టీడీపీలోనే అంతర్గత చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.