Begin typing your search above and press return to search.

ఏపీలో ఎమ్మెల్యేలు...మద్యం దుకాణానికి బెదిరింపులు ?

ఇక్కడ వేల కోట్ల వ్యాపారం జరిగింది అని ఖజానాకు చేరకుండా మధ్యలో నొక్కేశారు అన్న విమర్శలు నాడు విపక్షాలు చేశాయి.

By:  Tupaki Desk   |   7 Oct 2024 3:22 PM GMT
ఏపీలో ఎమ్మెల్యేలు...మద్యం దుకాణానికి బెదిరింపులు ?
X

గత ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసింది. తానే స్వయంగా మద్యం దుకాణాలను పెట్టించి తమకు నచ్చిన బ్రాండ్లు తెచ్చి మరీ కొనిపించి తాగించింది. ఇక్కడ వేల కోట్ల వ్యాపారం జరిగింది అని ఖజానాకు చేరకుండా మధ్యలో నొక్కేశారు అన్న విమర్శలు నాడు విపక్షాలు చేశాయి. దానికి కారణం డిజిటల్ పేమెంట్లు లేకుండా కరెన్సీ తో కధ అంతా నడిపించారు.

దాంతో ఖజానాకు నికరంగా ఎంత మొత్తం చేరింది అన్నది లెక్కలేదు, దీనినే ఏపీ లిక్కర్ స్కాం అంటూ విపక్షాలు పెద్ద నోరు చేశాయి. ఒక వైపు గత ప్రభుత్వం లిక్కర్ స్కాం మీద దర్యాప్తు చేపడతామని చెబుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త పాలసీని తెచ్చింది. నిజానికి ఇది పాత పాలసీయే. ప్రభుత్వం మద్యం షాపులకు వేలం వేయడం పాట పాడుకున్న ప్రైవేట్ వ్యాపారులు వాటిని నిర్వహించడం అన్న మాట.

ఇది ఎప్పటి నుంచో సాగుతున్న విధానమే. అయితే ఇందులోనూ స్కాములు స్కీములూ బోలెడు ఉన్నాయి. ఇక ఈసారి చూస్తే ఇంకా వేలం పాటలకు దరఖాస్తుల దగ్గరే మ్యాటర్ సీరియస్ అవుతోంది. ఏ ఏరియాకు ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు వారి అనుచరులు దందాలు చేస్తూ మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్న వ్యాపారులను బెదిరిస్తున్నారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.

మా ఏరియాలో మద్యం వ్యాపారం చేయాలి అంటే ముడుపులు ముందుగా మాకే చెల్లించుకోండి. ఆ మీదట నీ వ్యాపారం చేసుకో అన్న బెదిరింపులు ఒక ఎత్తు అయితే మద్యం వ్యాపారంలో షేర్లు ఇవ్వాల్సిందే అన్నది మరో కండిషన్. ఇంకో వైపు చూస్తే అసలు మీరు ఎవరు దరఖాస్తు చేయడానికి మా వాళ్ళు అన్నీ చూసుకుంటారులే మీరు గమ్మున ఉండండి అని ఒక సీటేస్ట్ హాటెస్ట్ వార్నింగ్ కూడా వెళ్తోందిట.

దాంతో మద్యం వ్యాపారులు దరఖాస్తులు చేసేందుకే జంకుతున్నారు అని అంటున్నారు. అసలే వేలం పాటల రూపంలో సర్కార్ భారీ ఎత్తున ఒక్కో ఏరియాకు ఇంత అంటూ రేటు పెంచేసింది. ఆ మీదట బిజినెస్ చేయాలి అంటే లాభం ఉండాలి కదా. ఈ మధ్యలో అందరికీ ముడుపులు కడుతూ పోతే నెత్తిన కొంగేసుకోవడమే అని ఏ లెక్కా కట్టకుండానే అర్ధం అయిన వారు అంతా గప్ చుప్ అని సైడ్ అయిపోతున్నారుట.

మరో వైపు చూస్తే తమకు మద్యం వ్యాపారాలలో మెలకువలు తెలుసు. లాభం ఎలా గడించాలో కూడా తెలుసు. వ్యాపారం చేయాలన్న ఆసక్తి ఉంది. కానీ ఈ బెదిరింపులేంటి అన్నదే వారిని మధన పెడుతోందిట. ఇపుడే ఇలా ఉంటే తీరా బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతీ రోజూ ఈ దందాల తలనొప్పి ఎవరు పడతారురా బాబూ అని వారు కూడా సైలెంట్ అవుతున్నారుట.

ఇక ఎమ్మెల్యేల దందా ఎలా ఉంది అంటే ప్రతీ మద్యం షాప్ నుంచి తమకు యాభీ శాతం షేర్ ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టేసారుట. అంటే ఏ కష్టం లేకుండా వచ్చిన వ్యాపారంలో సగానికి సగం అన్న మాట. మరి వారికే అంత ఇచ్చేస్తే ఇక మిగిలేది ఏముంటుంది అనుకుంటూ ఎందుకొచ్చిన తంటారా బాబూ అని కూడా మద్యం వ్యాపారాలు ఆలోచనలో పడ్డారుట.

ఇక చాలా జిల్లాలలో చూస్తే మా వాళ్ళే దరకాస్తు చేస్తారులే మీరు అలా గమ్మున ఉండండే అని కూడా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక హుకుం జారీ చేస్తున్నారుట. దాంతో మాకొద్దీ మద్యం వ్యాపారం అని చేతులు కట్టేసుకునే సీన్ అనేక జిల్లాలలో ఉంది అని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు ఏ పనీ పాటా లేకుండా మద్యం వ్యాపారులు గడిపారు.తమకు విలువైన కాలం పోయింది అని చింతించారు. వారే కూటమి సర్కార్ ని నెత్తిన పెట్టుకుని మరీ అధికారంలోకి తెచ్చారు. తమ ఏరియాల్లో ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. తీరా చూస్తే కనుక ఎమ్మెల్యేలు ఇలా రివర్స్ అవుతూ దందాలు చేయడంతో మొత్తం పాయే వ్యాపారం అంతా పాయే అనుకుంటూ తెగ ఫీల్ అవుతున్నారుట.

ఇదిలా ఉంటే ఏపీలోని మొత్తం 3396 మద్యం దుకాణాలకు గానూ ఏకంగా లక్షకు పైగా దరఖాస్తులు రెండు వేల కోట్లకు పైగా సొమ్ము వచ్చి పడుతుందని ఖజానా కళకళలాడుతుందని సర్కార్ పెద్దలు అనుకుంటే మొత్తం సీన్ రివర్స్ అయింది. దానికి కారణం గ్రౌండ్ లెవెల్ లో కూటమి ఎమ్మెల్యేలు అంతా చేరి కుంపటి పెట్టడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మ్యాటర్ మాత్రం ఇదీ. దీనిని ఎలా సెట్ రైట్ చేసుకుంటూ సర్కార్ ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సిందే.