ఏపీలో మొదలైన కొత్త లిక్కర్ షాపులు.. మద్యం ధరల్లో మార్పులివే!
చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినమేరకు క్వాలిటీ మద్యం అమ్ముతున్నామని షాపు యజమానులు చెబుతున్నారు!
By: Tupaki Desk | 16 Oct 2024 8:29 AM GMTఆంధ్రప్రదేశ్ లో మధ్యం షాపుల కేటాయింపులకు సంబంధించిన లాటరీల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినమేరకు క్వాలిటీ మద్యం అమ్ముతున్నామని షాపు యజమానులు చెబుతున్నారు!
అవును... ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లిక్కర్ పాలసీలో భాగంగా వీటి నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించింది. ఈ సమయంలో కొత్త దుకాణాలకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ సమయంలో లిక్కర్ ధరల్లో స్వల్ప మార్పులు చేసింది!
గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసిన కూటమి ప్రభుత్వం.. నూతన లిక్కర్ పాలసీలో భాగంగా కొత్త లిక్కర్ షాపుల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సోమవారం లాటరీ ప్రక్రియ పూర్తవ్వగా.. బుధవారం షాపులు ఓపెన్ అయ్యాయి. కొత్త స్టాకుతో షాపులు కళకళలాడుతున్నాయని అంటున్నారు.
లైసెన్స్ దక్కించుకోవడానికి.. షాపులు ఓపెన్ చెయ్యడానికీ మధ్య ఒక్కరోజే వ్యవధి ఉండటంతో వ్యాపారులు ప్రస్తుతానికి టెంపరరీగా షాపులను ప్రారంభించారు! త్వరలో పూర్తి స్థాయిలో భారీ ఎత్తున తమ షాపులను సకల సౌకర్యాలతోనూ నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇక గతంలో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకూ టైమింగ్స్ ఉండగా.. ఇప్పుడు వాటిని మార్చారు.
ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకే షాపులు ఓపెన్ చేయొచ్చని.. రాత్రి 10 గంటల వరకూ మద్యం దుకాణాలను తెరచి ఉంచొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో మద్యం ధరల విషంలోనూ ఏపీ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు అమ్మకాలపై రెండు శాతం సెస్ విధిస్తూ తాజాగా ఉత్తర్వ్యులు జరీ చేసింది.
ఏదైనా ఐ.ఎం.ఎఫ్.ఎల్. బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే.. దానిపై రూ.160 వసూలు చేయనుంది. క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 ఉంటే.. ప్రివిలేజ్ ఫీజు ఏపీఎఫ్ కలిపి రూ.100 అవుతుంది. కాగా... క్వార్టర్ లిక్కర్ ధర రూ.99 కే విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.