Begin typing your search above and press return to search.

భయపెడుతున్న కొత్త వ్యాధి.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

లిస్టెరియా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. అయితే ఇది లైట్ తీసుకునే చిన్న వ్యాది కాదు

By:  Tupaki Desk   |   25 Aug 2023 9:50 AM GMT
భయపెడుతున్న కొత్త వ్యాధి.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
X

ప్రపంచం అడ్వాన్స్ అయ్యే కొద్దీ.. రోగాలు కూడా అడ్వాన్స్ అవుతున్నాయి! మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లకు తోడు శరీరానికి వ్యాయామం లేకపోవడంతోపాటు.. ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవడంతో కొత్త కొత్త బాక్టీరియాలు పుట్టుకొస్తున్నాయి.

అవును... తాజాగా అమెరికాలో మిల్క్ షేక్ తాగి ముగ్గురు మరణించారు. కారణం మిల్క్ షేక్ కాదు... అది కలుషితం అయ్యి అందులో లిస్టేరియా బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకడమే! దీంతో... ఆ బ్యాక్టిరీయా ఏంటీ.. జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి.. అసలు ఆ బాక్టీరియా ఎక్కడ పుడుతుంది.. ఎలా వ్యాపిస్తుంది అనే చర్చ మొదలైంది.

లిస్టెరియా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. అయితే ఇది లైట్ తీసుకునే చిన్న వ్యాది కాదు. ఇది ప్రాణాంతక వ్యాది! ఇది సాధారణంగా సరిగ్గా ప్రాసెస్ చేయని మాంసాలు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల వస్తుంది.

ఇదే సమయంలో చల్లని పరిస్థితుల్లో ఇది బాగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. రిఫ్రిజిరేటర్‌ లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇది ఆ ప్రాంతంలో బాక్టీరియా బాగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది.

ఈ వ్యాది లక్షణాలు:

లిస్టెరియా వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తికి జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు, వికారం, మెడ నొప్పి, కండరాల నొప్పులు, గందరగోళం, సమతుల్యత కోల్పోవడం వంటివి ఉంటాయని చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఈ ఇన్‌ ఫెక్షన్‌ సంక్రమణ తర్వాత వ్యాధి 70 రోజుల పాటు కొనసాగుతుంది. లిస్టేరియా ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు యాంటీబయాటిక్స్ మొదటి శ్రేణి చికిత్స అని నిపుణులు అంటున్నారు. వ్యాధి సోకిన వ్యక్తి చాలా విశ్రాంతి తీసుకోవాలి.

ఈ సమయంలో రోగి ద్రవరూపం ఆహారం తీసుకోవడం పెంచాలి. తేలికపాటి ఆహారం, గంజి వంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది.

ఎవరికి ఎక్కువగా సోకుతుంది:

గర్భిణీలు, 65 ఏళ్లు పైబడిన వారితోపాటు.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న అన్ని వయస్కుల వారూ ఈ ఇన్ఫెక్షన్‌ కు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే... ఈ ఇన్ఫెక్షన్ ఆరోగ్యవంతులకు సోకే అవకాశం తక్కువని నిపుణులు అంటున్నారు.