Begin typing your search above and press return to search.

లైవ్ అప్ డేట్స్:శాలువాతో నాగార్జున.. చిరునవ్వులతో రేవంత్.. పిక్స్ వైరల్!

ఇందులో భాగంగా.. ఈ సమావేశానికి సినీ పెద్దల తరుపున హాజరైన అక్కినేని నాగార్జున.. సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 5:18 AM GMT
లైవ్  అప్  డేట్స్:శాలువాతో నాగార్జున.. చిరునవ్వులతో రేవంత్.. పిక్స్  వైరల్!
X

సినీ ప్రముఖులతో భేటీకి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... సినీ ప్రముఖుల ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశం అనంతరం.. సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు!

ఇప్పటికే చేరుకున్న సినీ ప్రముఖుల జాబితాలో… దిల్ రాజు, సురేష్ బాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీమోహన్, త్రివిక్రం, సాయిరాజేష్, సీ. కల్యాణ్, హరీశ్ శంకర్, బీవీఎన్ ప్రసాద్, కిరణ్ అబ్బవరం, వశిష్ట, నవీన్, రవిశంకర్, గోపి ఆచంట మొదలైనవారు చేరుకున్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికీ - తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చినట్లుందనే చర్చలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. సీఎంతో మాట్లాడి.. నిర్మాత, ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు!

అవును... నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులతో పాటు 11 మంది నటులు హాజరు కానున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సమావేశం జరిగే... కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఇప్పటికే సినీ ప్రముఖులు చేరుకున్నారు! ఇక ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు డీజీపీ, ఇతర అధికారులు పాల్గొనబోతున్నారని అంటున్నారు.

..

సినీ పెద్దలు - తెలంగాణ సర్కార్ మధ్య తాజాగా జరుగుతున్న భేటీకి సంబంధించి ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. కులగణన సర్వేతో పాటు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కు సినిమా హీరోలు, హీరోయిన్లు మందుకు రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో.. ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలకు సినీ ప్రముఖులు ప్రచార సహకారం అందించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో... సినిమా టిక్కెట్లపై ప్రత్యేక సెస్ ను ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే నిధులను ఇంటిగ్రేటేడ్ స్కూళ్లకు వినియోగించనున్నట్లు ప్రతిపాదించనున్నారని అంటున్నారు.

..

సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ముందుగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారని అంటున్నారు. ప్రధానంగా... ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతోనే తమ ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందని తెలిపారని తెలుస్తోంది.

ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని.. అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రెటీలదే అని రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... బౌన్సర్ల విషయంలోనూ సీఎం సీరియస్ గా స్పందించారని అంటున్నారు. ఒక్కొక్కరూ 30 - 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే.. వారేమో తమ ప్రతాపాన్ని సామాన్య ప్రజలపై చూపిస్తున్నారని అన్నారని సమాచారం!

ఇదే సమయంలో.. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్ లో ఇండస్ట్రీ చొరవ చూపాలాని.. ప్రచారానికి హీరోలు, హీరోయిన్ లు ముందుకు రావాలని సీఎం ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలోనూ ఇండస్ట్రీ సహాకారం అందించాలని కోరినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షో లు ఉండవంటూ చేసిన కామెంట్లకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించారని అంటున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా సీఎం ఉన్నారని తెలుస్తోంది.

...

కామండ్ కంట్రోల్ సెంట్రల్ లో తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు సినిమా పెద్దలు సమావేశమై చర్చిస్తున్న వేళ.. ఆ బయట ఓ ఆసక్తికర ఫ్లకార్డ్ దర్శనమిచ్చింది. ఆ ఫ్లకార్డుపై "సినిమా పెద్దలు కాదు.. గద్దలు" అని రాసి ఉంది. ఆ ఫ్లాకార్డును ప్రదర్శిస్తూ ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "లోపల సీఎంతో పాటు సినిమా పెద్దలు కూర్చున్నారు.. అంటే.. డబ్బులున్నోళ్లే పెద్దలా?.. మాలాంటికి ఇవ్వండి సర్.. మా వాయిస్ వినిపించండి.. 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు తీసుకునేవరే సినిమా పరిశ్రమనా?.. సినిమా పరిశ్రమ అంటే కార్మికుల దగ్గర నుంచి మొదలవుతుంది" అని ఫ్లకార్డు పట్టుకున్న వ్యక్తి వ్యాఖ్యానించారు.

"నేను సామాన్య ప్రేక్షకుడిని.. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో టిక్కెట్ ధరలు లేవు.." అంటూ సదరు వ్యక్తి వ్యాఖ్యానించారు.

....

తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వెళ్లడించారు. ఇందులో భాగంగా...

అందరు ముఖ్యమంత్రులూ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని.. ఇదే క్రమంలో తాజా తెలంగాణ ప్రభుత్వం కూడా బాగా చూసుకుంటుందని మొదలుపెట్టిన రాఘవేంద్రరావు.. ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ గా దిల్ రాజు ను నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ని హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నట్లు తెలిపారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన నాగార్జున... యూనివర్సల్ లెవెల్ లో స్టూడియో సెటప్ ఉండాలని.. ఈ విషయంలో ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున అన్నారని అంటున్నారు. ఇదే సమయంలో.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలన్నదే మా కోరిక అని నాగార్జున అన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్పందించిన అల్లు అరవింద్... ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారని అంటున్నారు. ఇదే సమయంలో.. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినం అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారని అంటున్నారు.

.....

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీసీసీలో జరిగిన సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా.. ఈ సమావేశానికి సినీ పెద్దల తరుపున హాజరైన అక్కినేని నాగార్జున.. సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పారు. అనంతరం ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ.. కరచాలనం చేశారు. అనంతరం నాగార్జున డిప్యూటీ సీఎంకు నమస్కారం చేశారు. దీంతో.. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా... ఇటీవల నాగార్జున ఫ్యామిలీకి చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ సెంటర్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్న "హైడ్రా" కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.

Live Updates

  • సినీ పెద్దల సమక్షంలో డీజీపీ కీలక వ్యాఖ్యలు!
    26 Dec 2024 7:40 AM GMT

    సినీ పెద్దల సమక్షంలో డీజీపీ కీలక వ్యాఖ్యలు!

    తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పెద్దలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమకు ప్రజల భద్రత ముఖ్యమని తెలిపారు. షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకొవాలని డీజీపీ జితేంద్ర స్పష్టం చేశారు.

    ఇదే సమయంలో... అనుమతులను ముందుగా తీసుకోవాలని, అందులో షరతులు కూడా ఉంటాయని అన్నారు! ప్రధానంగా బౌన్సర్ల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. బౌన్సర్లు సహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు!