Begin typing your search above and press return to search.

కల్లు తాగి.. లోన్ యాప్ అప్పు తీర్చేందుకు అంత పనిచేశాడా?

లోన్ యాప్ లను ఆశ్రయించి విచ్చలవిడిగా రుణాలు తీసుకుని జల్సాలు చేస్తూ సదరు అప్పులు తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2024 12:30 PM GMT
కల్లు తాగి.. లోన్ యాప్ అప్పు తీర్చేందుకు అంత పనిచేశాడా?
X

యువత పెడదారిన పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడుతున్నారు. సులభంగా మనీ సంపాదించాలనే యావలో యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ దొంగతనాలు ఎలా చేయాలనే దానిపై శిక్షణ తీసుకుంటున్నారు. ఫలితంగా చోరులుగా అవతారమెత్తుతున్నారు. లోన్ యాప్ లను ఆశ్రయించి విచ్చలవిడిగా రుణాలు తీసుకుని జల్సాలు చేస్తూ సదరు అప్పులు తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. చివరకు కటకటాలపాలవుతున్నారు.

తాజాగా సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్న చోరీ కేసు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఓ మహిళ అక్బర్ పేట మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాన్ వద్ద మూడు నెలలుగా కల్లు విక్రయం చేస్తోంది. గురువారం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ యువకుడు అక్కడకు వచ్చాడు. కల్లు తాగి తిరిగి వెళ్లే క్రమంలో ఆమె మెడలోని రెండు తులాల గొలుసు లాక్కుని పరారయ్యాడు.

పోలీసులు ఘటనపై వివరాలు నమోదు చేసుకుని రెండు టీంలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. దీంతో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి వద్ద నుంచి బంగారం రికవరీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లవన్ కుమార్ గా గుర్తించారు. తమదైన శైలిలో విచారించగా దోచుకున్న వస్తువులను రికవరీ చేశారు.

విచ్చలవిడిగా రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సరదాలకు పోయి ఇలా దొంగలుగా అవతారమెత్తుతున్నారు. యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. తమ బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. పెడదారిన వెళుతూ బతుకును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

మంచిగా చదువుకుని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఇలా దొంగలుగా పట్టుబడుతున్నారు. చిన్న చిన్న నేరాలకు శిక్షలు అనుభవిస్తూ బంగారు భవిష్యత్ ను పాడు చేసుకుంటున్నారు. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాల్సిన సమయంలో ఇలా దొంగలుగా ముద్ర పడుతున్నారు. చోరులుగా తమ జీవితాన్ని ముళ్ల దారుల్లో తీసుకెళ్తున్నారు.