Begin typing your search above and press return to search.

ఏపీలో ఐబీ, సీబీఎస్ఈ పై లోకేష్ ఫుల్ క్లారిటీ!

ఈ సందర్భంగా... 2024 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారంటూ కథనాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   7 March 2025 6:29 PM IST
ఏపీలో ఐబీ, సీబీఎస్ఈ పై లోకేష్  ఫుల్  క్లారిటీ!
X

తమ ప్రభుత్వ హయాంలో ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియంతో పాటు సీబీఎస్ఈ, ఐబీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడంపై వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... 2024 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారంటూ కథనాలొచ్చాయి.

నాడు ఈ విషయాలపై స్పందించిన జగన్... ప్రతీ ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ఐబీ, సీబీఎస్ఈ విద్యావిధానంపై ఏపీ అసెంబ్లీలో లోకేష్ క్లారిటీ ఇచ్చారు. నాడు జరిగింది అగ్రిమెంట్ మాత్రమే అని వెల్లడించారు!

అవును... గత ప్రభుత్వ హయాంలో వినిపించిన ఐబీ, సీబీఎస్ఈ విద్యావిధానంపై నేడు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఏపీలో ఐబీ స్కూల్స్ పెట్టలేదని.. కానీ, ఐబీ నుంచి ఓ రిపోర్ట్ తెప్పించేందుకు రూ.5కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇక సీబీఎస్ఈ విషయానికొస్తే... తాను కూడా సీబీఎస్ఈ విద్యార్థినే అని లోకేష్ గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ పరీక్షలంటే.. యూనిట్ టెస్టుల నుంచి, సెమీ ఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ తర్వాత ఫైనల్స్ కు వెళ్తామని తెలిపారు. ఇదేమీ జరగకుండా, ఉపాధ్యాయులను ప్రిపేర్ చేయకుండానే సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నారని.. నైన్త్ క్లాసులోనూ ఆ మోడల్ తీసుకురాలేదని అన్నారు.

దీంతో... తాను భయపడి మాక్ ఎగ్జామ్ పెట్టమని అడిగానని.. ఆ మాక్ ఎగ్జామ్ లో 90శతం మంది పిల్లలు ఏదొక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారని వెల్లడించారు. అందువల్లే ఈ సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ని మూడేళ్లు వాయిదా వేయాలని.. ఈ లోపు టీచర్స్ ని రెడీ చేసి, విద్యార్థులను ప్రిపేర్ చేద్దామని తాను చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో... విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని.. "వన్ క్లాస్ – వన్ టీచర్" విధానాన్ని తాను బలంగా విశ్వసిస్తానని.. అయితే, ప్రస్తుతం 1400 స్కూల్స్ లో మాత్రమే ఈ విధానం ఉందని.. త్వరలో 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామని లోకేష్ తెలిపారు.