Begin typing your search above and press return to search.

నారా లోకేష్ కు 'రాఘ‌వేంద్ర పుర‌స్కారం' ఎందుకు?

ప్ర‌ముఖులు, దేశానికి సేవ చేసిన వారికి ఈ స‌త్కారంతో అభినందించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   2 March 2025 5:27 AM GMT
నారా లోకేష్ కు రాఘ‌వేంద్ర పుర‌స్కారం ఎందుకు?
X

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌కు క‌ర్నూలు జిల్లాలోని మంత్రాల‌యంలో ఉన్న‌ ప్ర‌ఖ్యాత రాఘ‌వేంద్ర‌స్వామి మఠం అత్యున్న‌త పుర‌స్కారం ప్ర‌దానం చేసింది. స‌మాజ సేవ‌ల‌కు అంకిత‌మైనవారు, ప్ర‌ఖ్యాత వ్య‌క్తుల‌కు ఇచ్చే 'గురువైభ‌వోత్సవ‌' పుర‌స్కారాన్ని మంత్రి నారా లోకేష్‌కు ప్ర‌దానం చేశారు. సాధార‌ణంగా మ‌ఠాలు ఏవీ ఎవ‌రినీ స‌త్క‌రించ‌వు. కానీ, రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠంలో కొన్నేళ్లుగా ఈ కొత్త సంప్ర‌దాయాన్ని తీసుకువ‌చ్చారు. ప్ర‌ముఖులు, దేశానికి సేవ చేసిన వారికి ఈ స‌త్కారంతో అభినందించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

శ‌నివారం నారా లోకేష్ రాఘ‌వేంద్ర‌స్వామి మ‌ఠాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. రాఘ‌వేంద్ర పాదుకాభిషేకం స‌హా గురు వైభ‌వోత్స‌వాల్లోనూ నారా లోకేష్ పాల్గొన్నారు. అనంత‌రం.. ఆయ‌న‌కు మ‌ఠాధిప‌తి సుబుదేంద్ర‌తీర్థులు.. గురువైభ‌వోత్స పుర‌స్కారాన్ని అందించారు. దీని కోసం ఎంతో మంది వేచి చూడ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి అత్యున్నత మ‌ఠ సంప్ర‌దాన్ని పొందాల‌ని చాలా మంది ప్ర‌క‌టిస్తూ ఉంటారు. కాగా.. నారా లోకేష్ ప‌ర్య‌ట‌న వెనుక‌.. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు కొంద‌రు ఉన్నార‌ని తెలిసింది. వారి సూచ‌న‌లు స‌ల‌హా మేర‌కు.. నారా లోకేష్ ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

న‌మ్మ‌కం ఇదీ..

రాఘ‌వేంద్ర మ‌ఠాన్ని ద‌ర్శించుకునేవారికి ప‌లు న‌మ్మ‌కాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మ‌రింత పురోభివృద్ధి కోరుకునేవారు.. ఈ మ‌ఠానికి వ‌స్తే.. సాధిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది. అదేవిధంగా మాన‌సిక ప్ర‌శాంత‌త కోరుకునేవారు ఈ మ‌ఠాన్ని ప్ర‌త్యేకంగా ఎంచుకుని వ‌స్తారు. సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి తోపాటు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు వంటివారు కూడా.. త‌రచుగా మంత్రాల‌యం ద‌ర్శింస్తూ ఉంటారు. కేవ‌లం సినీ రంగానికి చెందిన‌వారే కాకుండా.. రాజ‌కీయ నాయ‌కులు ఎక్కువ‌గా ఇక్క‌డ‌కు వ‌స్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే నారా లోకేష్ తాజాగా ఇక్క‌డ ప‌ర్య‌టించార‌ని తెలుస్తోంది.