Begin typing your search above and press return to search.

దర్పం లేని లోకేష్ దర్బార్!

గతంలో ఎందరో మంత్రులుగా పనిచేశారు కానీ వారు ప్రజా దర్బార్ లని నిర్వహించిన దాఖలాలు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 11:30 PM GMT
దర్పం లేని లోకేష్ దర్బార్!
X

టీడీపీ యువ నాయకుడు, మంత్రి అయిన నారా లోకేష్ కి తట్టిన వినూత్న ఆలోచన ప్రజా దర్బార్. గతంలో ఎందరో మంత్రులుగా పనిచేశారు కానీ వారు ప్రజా దర్బార్ లని నిర్వహించిన దాఖలాలు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు. ముఖ్యమంత్రులు అయితే ఆ విధంగా కొన్ని సందర్భాల్లో చేసి ఉన్నారు.

లోకేష్ మాత్రం తనదైన పాలనా వైఖరిని ప్రస్పుటించే విధంగా ప్రజా దర్బార్ ని నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా తగ్గడం లేదు. ఆయన వివిధ జిల్లాలకు పర్యటనకు వచ్చినా కూడా అక్కడ కూడా ప్రజా దర్బార్ ని నిర్వహించడం ద్వారా అది నిరంతరాయంగా సాగేలా చూసుకుంటున్నారు.

ఆ విధంగా లోకేష్ ప్రజా దర్బార్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజా దర్బార్ నిర్వహించడం సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించడం మాత్రమే కాదు వాటికి తగిన పరిష్కారాన్ని కూడా చూపించడంలో లోకేష్ ప్రజా దర్బార్ మంచి మార్కులు సాధించింది అని అంటున్నారు. ఏకంగా ఇప్పటి వరకూ యాభై రోజుల పాటు లోకేష్ ప్రజా దర్బార్ సాగింది అంటే గ్రేట్ అనాల్సిందే అంటున్నారు.

అంతే కాదు లోకేష్ ప్రజా దర్బార్ కు ఈ యాభై రోజుల వ్యవధిలో 5 వేల 810 వినతులు వచాయి. అయితే ఇందులో 4 వేల 410 సమస్యలకు పరిష్కారం లభించడం అంటే లోకేష్ ప్రజా దర్బార్ సక్సెస్ రేటు ఏమిటి అన్నది చాటి చెబుతోంది అని అంటున్నారు. ప్రజా దర్బార్ కి వచ్చిన సమస్యలకు 75 శాతం పైగా పరిష్కారాలు లోకేష్ నుంచి దక్కుతున్నాయని అంటున్నారు.

దీంతో ఏపీ నలుమూలల నుంచి మంగళగిరిలోని లోకేష్ ప్రజా దర్బార్ కి జనాలు వెల్లువలా క్యూ కడుతున్నారు. లోకేష్ కూడా క్రమం తప్పకుండా ఠంచనుగా ఉదయం గంట పాటు ప్రజా దర్బార్ ని నిర్వహిస్తున్నారు. వచ్చిన ప్రతీ వారి సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం మీద ఆదేశాలు అక్కడికక్కడే ఇస్తున్నారు. దాంతో ప్రజా దర్బార్ కి వెళ్ళిన వారు అంతా ఫుల్ హ్యాపీ మూడ్ తో వెనక్కి తిరిగి వస్తున్నారు.

ఇది నిజంగా లోకేష్ సాధించిన బిగ్ అచీవ్ మెంట్ గానే అంతా చూస్తున్నారు. ఇక ప్రజా దర్బార్ లో లోకేష్ నుంచి ఆదేశాలు అంటే అధికారులు సైతం అలెర్ట్ గా ఉంటున్నారు. వాటి పరిష్కారంలో కూడా వేగం చూపిస్తున్నారు. దాంతో ప్రజా దర్బార్ కి మంచి పేరు వస్తోంది.

మరో వైపు చూస్తే లోకేష్ ప్రజా దర్బార్ లో సగానికి సగం సమస్యలు రెవిన్యూ హోం శాఖకు సంబంధించినవి వస్తున్నాయని అంటున్నారు. అలాగే ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు, విద్యా రంగం విషయంలోనూ మిగిలిన యాభై శాతం సమస్యలు ఉంటున్నాయి అని అధికారులు వెల్లడిస్తున్నారు

ఇక తమకు ఉపాధి కావాలని కూడా లోకేష్ ప్రజా దర్బార్ కి యువత వస్తున్నారు. అలా వచ్చిన దాదాపుగా 800 వినతుల మీద లోకేష్ సీరియస్ గానే దృష్టి పెట్టారని అంటున్నారు. వారి అర్హత్లనౌ బట్టి అవసరమైన చోట జాబ్స్ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మూడు వందల మంది దా ఉపాధిని పొందేందుకు వీలుగా ప్రజా దర్బార్ లో చర్యలు తీసుకుంటున్నారు.

అదే విధంగా పెన్షన్ల కోసం కూడా నాలుగు వందల మంది దాకా దరకాస్తు చేసుకుని వినతులు సమర్పించారు. వారి విషయంలోనూ సానుకూలంగా ప్రజా దర్బార్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి దర్జాకు దర్పానికి దూరంగా సామాన్యులకు చేరువగా లోకేష్ చేపట్టిన ప్రజా దర్భార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది అని అంటున్నారు.