Begin typing your search above and press return to search.

టీడీపీలో అంత వీజీ కాదు...ఆయన అనుమతి కావాల్సిందే ?

అందుకే బాబుని ఎన్నో మాటలు అన్న వారు కూడా ఆ తరువాత కాలంలో హాయిగా పసుపు పార్టీ నీడన చేరిపోయారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 12:30 AM GMT
టీడీపీలో అంత వీజీ కాదు...ఆయన అనుమతి కావాల్సిందే ?
X

తెలుగుదేశం పార్టీలో ఒకపుడు చేరికలు చాలా ఈజీ. పార్టీని వీడిపోయిన వారు తిరిగి వస్తామని అంటే చంద్రబాబు పాత విషయాలను సైతం పక్కన పెట్టి అక్కున చేర్చుకునే వారు. చంద్రబాబు తనను ఎన్ని విమర్శలు చేశారు అన్నది కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం అని ఒక ట్రూ పొలిటీషియన్ గా వ్యవహరించేవారు.

అందుకే బాబుని ఎన్నో మాటలు అన్న వారు కూడా ఆ తరువాత కాలంలో హాయిగా పసుపు పార్టీ నీడన చేరిపోయారు. అనేక పదవులు కూడా వారు అనుభవించారు. చాలా మంది టీడీపీని ఎన్నికల్లో దెబ్బ తీసినా వారు తాముగా వచ్చి పార్టీలో చేరుతామని అంటే చంద్రబాబు ఓకే చెప్పేవారు.

ఆయన పార్టీని నడపడంలో విలక్షణత అలాంటిది. అయితే ఇపుడు మాత్రం టీడీపీలో చేరాలి అంటే చినబాబు నారా లోకేష్ అనుమతి కావాల్సిందే అని అంటున్నారు. నారా లోకేష్ ఇపుడు టీడీపీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. పార్టీ దైనందిన వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నారు అని చెబుతున్నారు.

ఒక విధంగా భవిష్యత్తు టీడీపీ ఎలా ఉండాలో అన్నీ చూసుకుంటూ తీర్చిదిద్దుతున్నారు లోకేష్. టీడీపీలో ఎక్కువగా యువ నాయకత్వానికి ఆయన ప్రోత్సాహం ఉంటోంది. అదే సమయంలో పార్టీకి కష్టకాలంలో దెబ్బేసిన వారిని తిరిగి చేర్చుకోవడానికి లోకేష్ అంత సుముఖంగా ఉండడం లేదు అని ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు అయిదేళ్ళూ పెద్దగా పనిచేయని నాయకులు చాలా మందికి టికెట్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి.

అంతే కాదు వారికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినా మంత్రి పదవులు అయితే దక్కలేదు. వారు అలా జస్ట్ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ఇదంతా కూడా పార్టీలో వచ్చిన నవీన మార్పు అని అంటున్నారు. టీడీపీలో చూస్తే పార్టీ ఓడాక వేరే పార్టీలలో చేరి అక్కడ అన్నీ అనుభవించి తీరా టీడీపీ పవర్ లోకి వచ్చాక వచ్చి చేరుతామని అంటున్న నాయకుల విషయంలో లోకేష్ గట్టిగానే ఉంటున్నారు అని అంటున్నారు.

దాంతో చాలా మంది నేతలకు క్లియరెన్స్ పెండింగులో పడింది అని అంటున్నారు. వారంతా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏనాడో పార్టీలో చేరిపోయేవారు. కానీ వారి అవసరం లేదు అని భావిస్తున్నారో ఏమో కానీ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. చంద్రబాబు వరకూ ఓకే అనుకున్నా లోకేష్ మాత్రం ఇలాంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి గత మూడు నెలలుగా టీడీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదు అని అంటున్నారు. అలాగే వైసీపీ నుంచి మరి కొంతమంది రాజీనామా చేసి పదవులు అక్కడ వదులుకుని వచ్చినా ఇక్కడ మాత్రం తలుపులు తెరచుకోవడం లేదు. ఇదే విధానం గట్టిగా ఫ్యూచర్ లో అమలు అవుతుంది అని చెబుతున్నారు.

టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఈ రోజు ఉంది. పైగా యంగ్ బ్లడ్ గట్టిగా ఉంది. పార్టీలో చాలా మంది నేతలు కష్టపడి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇపుడు కొత్తగా ఫిరాయింపు నేతలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నదే పార్టీ లో యువ నాయకత్వం ఆలోచన అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీలో చేర్చుకుంటే చాలు పదవులు కూడా అక్కరలేదు, ఏమీ అడగమని కూడా అంటున్నారు. కానీ పార్టీలో మాత్రం ఈ తరహా నేతలను తీసుకుంటే అదే అలవాటుగా మారిపోతోందని అని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో చేరడం అంటే ఇపుడు ఏ మాత్రం సులువు కానే కాదు అని అంటున్నారు. అన్ని లెక్కలూ చూసుకుని పక్కాగా కుదిరితేనే తలుపులు అక్కడ తెరచుకుంటాయని అంటున్నారు.