Begin typing your search above and press return to search.

లోకేష్ మాటే ఫైనల్ !

ఏది ఏమైనా లోకేష్ ని 2029 ఎన్నికల తరువాత ఏపీకి సీఎం గా కూర్చోబెట్టాలని చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 6:58 AM GMT
లోకేష్ మాటే ఫైనల్ !
X

తెలుగుదేశం పార్టీలో ఇపుడు నారా లోకేష్ దే హవా అని అంటున్నారు. ఎన్నో కీలకమైన నిర్ణయాలలో లోకేష్ దే ఫైనల్ డెసిషన్ గా ఉంటోంది అని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేతగా చంద్రబాబు ఉంటున్నా లోకేష్ మెల్లగా పార్టీ మీద తన పట్టుని బిగించారు. ఆయన పార్టీలో జూనియర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ యూత్ వింగ్ అన్నది ఒకటి ఉంది.

అందులో ఉన్న వారే ఫ్యూచర్ లో లోకేష్ తో కలసి ప్రయాణం చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీలో యువ రక్తం తీసుకుని రావాలని లోకేష్ గట్టిగా భావిస్తున్నారు. ఇక టీడీపీ సభ్యత్వం ఎన్నడూ లేని విధంగా కోటి మార్క్ చేరుకునేలా ఉంది. దాని వెనక లోకేష్ ఉన్నారని అంటున్నారు.

ఆయన పట్టుదల పట్టి మరీ రికార్డు స్థాయి సభ్యత్వాలు చేయిస్తున్నారు. గతంలో ఒక టైం పెట్టుకుని అక్కడితో సభ్యత్వాలు నిలుపు చేసేవారు కానీ లోకేష్ మాత్రం మరింత గడువు పొడిగించాలని ఆలోచించి కోటి మార్క్ టార్గెట్ కి పార్టీని రీచ్ చేస్తున్నారు.

పార్టీలో ఎవరేమిటి అన్నది కూడా ఆయనకు బాగా అవగాహన ఉందని చెబుతున్నారు. ఇక కేబినెట్ లో ఎక్కువ మంది కొత్త వారు జూనియర్లకు పదవులు ఇవ్వడం వెనక కూడా లోకేష్ మార్క్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఇటీవల రాజ్యసభకు సానా సతీష్ బాబుని ఎంపిక చేశారు. ఆయన ఎంపిక అనూహ్యంగా తెర మీదకు వచ్చింది

కనీసం మీడియా కూడా అంచనా వేయలేకపోయింది. అలా చివరి నిముషంలో వచ్చిన ఆయన లోకేష్ చాయిస్ అని అంటున్నారు. ఇపుడు చూస్తే కనీసంగా అయిదారుగురు సీనియర్లు ఉండగా విజయానంద్ ని ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించడం వెనక కూడా లోకేష్ ఉన్నారని ప్రచారం సాగుతోంది.

విజయానంద్ లోకేష్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖకు స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు అని అంటున్నారు. దాంతో విజయనంద్ కి లోకేష్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయని అందువల్లనే ఆయన పేరుని కొత్త సీఎస్ గా ఎంపిక చేశారు అని అంటున్నారు.

ఇవే కాదు ప్రభుత్వంలో జరిగే అనేక నిర్ణయాల వెనక లోకేష్ ప్రభావం ఉంటోందని అంటున్నారు. చంద్రబాబు తాను సీఎం గా ఉండగా అమరావతి రాజధానికి ఒక రూపు తీసుకుని రావడంతో పాటు పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ రెండింటి మీదనే బాబు ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు దాంతో మిగిలిన విషయాలు లోకేష్ చూసుకుంటున్నారని వాటిని మోనిటరింగ్ చేయడం వరకే బాబు పరిమితం అవుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ ని 2029 ఎన్నికల తరువాత ఏపీకి సీఎం గా కూర్చోబెట్టాలని చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.

లోకేష్ కి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారని చెబుతున్నారు. 2029 లో మరోసారి టీడీపీకి అధికారం బాబుకు చాలా ముఖ్యం. బాబు ఐదవసారి సీఎం అయితే కాబోరని ఆ ప్లేస్ లో లోకేష్ తొలిసారి సీఎం అవుతారని అంటున్నారు. దానికి సంబంధించిన పూర్వరంగం అయితే సిద్ధం అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి సీనియర్ ఆఫీసరులు ఐఏఎస్ ఐపీఎస్ అఫీసరులు ఇలా టోటల్ అధికార యంత్రాంగం మీద కూడా లోకేష్ కి పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. సో ఫ్యూచర్ టీడీపీ లీడర్ కాబోయే సీఎం గా లోకేష్ బాగా ప్రొజెక్ట్ అవుతున్నారు అని అంటున్నారు.