రెడ్ బుక్ స్టార్ట్...ఎండింగ్ అంటూ లోకేష్ సంచలనం
రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు అన్నీ రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక లెక్క సరిచేస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు.
By: Tupaki Desk | 20 Jan 2025 4:30 PM GMTరెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పద ప్రయోగం చేసిన ఘనత అచ్చంగా నారా లోకేష్ దే ఆయన యువగళం పేరుతో సాగించిన పాదయాత్రలో ప్రతీ చోటా రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు అన్నీ రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక లెక్క సరిచేస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటోంది వైసీపీ. అయితే రెడ్ బుక్ ఇంకా పక్కాగా అమలు కావాలని టీడీపీ అభిమానులు క్యాడర్ కోరుకుంటున్నారు. మరి రెడ్ బుక్ ఆవిష్కర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీని మీద ఏమి చెబుతున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
జ్యూరిచ్లో జరిగిన తెలుగు ప్రవాసులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, ఒక తమ్ముడు రెడ్ బుక్ గురించి తన వద్ద ప్రస్తావించారని అన్నారు రెడ్ బుక్ విషయం ఇంతలా పాపులర్ కావడం పట్ల ఆయన ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు తాను పాదయాత్రలో రెడ్ బుక్ గురించి మాట్లాడినపుడు కూడా ఇంతలా చర్చకు రాలేదని అన్నారు
అయితే అధికారంలోకి వచ్చాం కదా అని కక్ష తీర్చుకునే ప్రభుత్వం మాది కాదని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్ స్టార్ట్ అయింది అని ఆయన అక్కడ సభికులతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఏ విషయం అయినా ఎస్టాబ్లిష్ చేయాలి కదా అని కూడా అన్నారు. దీనిని అండర్ లైన్ చేసుకోవాలని సూచించారు
రెడ్ బుక్ విషయంలో ఎలాంటి డౌట్లూ ఉండనక్కరలేదని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో చెప్పిందేటి అన్నది కూడా వివరించారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లఘించి ప్రజలను కార్యకర్తలను బాధపెట్టారో వాళ్ళను వదిలేది లేదు అని క్లారిటీగా చెప్పామని అన్నారు
అందువల్ల ఎలాంటి సందేహమూ అవసరం లేదు, మీరు రిలాక్స్ గా ఉండండి అన్నీ చూస్తారు అని లోకేష్ చెప్పారు. రెడ్ బుక్ పని ఆల్రెడీ మొదలైంది. దానిని పూర్తి చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని లోకేష్ కీలక కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఇదే స్పీచ్ లో లోకేష్ చంద్రబాబు గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.బాబుతో పాటుగా పనిచేయడం అంటే కష్టమే అంటూ మాట్లాడారు. ఆయనలా పోటీ పడలేమని కూడా లోకేష్ చెప్పడం విశేషం. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా లోకేష్ ఆయన వివరించారు. అవును అది నిజమే అని అంతా ఒప్పుకునే మాట. ఆయన వయసు ఏడున్నర పదులు. అయినా ఆయన ఎనర్జీ ఎవరికీ లేదు, రాదు. ఆఖరుకి ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అయినా అదే మాట అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పనిచేయడం అంటే చాలా కష్టమని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.