Begin typing your search above and press return to search.

ఆ ప్లేస్ లోకేష్ దే...అచ్చెన్న చెప్పిన సత్యం

వీటి మధ్యలో మరోసారి సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు లోకేష్ గురించి ఏమన్నారో చూస్తే ఆశ్చర్యమేమీ ఉండదు కానీ భలే తమాషాగా అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:04 PM GMT
ఆ ప్లేస్ లోకేష్ దే...అచ్చెన్న చెప్పిన సత్యం
X

రాజకీయాల్లో చాలా తమాషాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసే జనాలకు మాత్రం అన్నీ గుర్తు ఉంటాయి. అందుకే వారు వాటిని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకనాడు పార్టీ లేదు ఏమీ లేదు అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ కామెంట్స్ చేశారు అన్నది వైరల్ అయింది. అదే సమయంలో లోకేష్ మీద కూడా కొన్ని కామెంట్స్ ఆయన చేశారు అన్న వార్తలూ ప్రచారం అయ్యాయి.

తాను అలా అనలేదని అచ్చెన్న తరువాత చెప్పినా వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ తిరిగింది. ఆయన మాత్రమే కాదు అప్పట్లో సీనియర్లు అంతా కూడా లోకేష్ ని లైట్ తీసుకున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న విషయంగా చెప్పుకున్నారు. కానీ కాలం గొప్పది. అందుకే అంతా తమషాగా జరిగిపోతోంది.

లోకేష్ పట్టుదలగా పనిచేసారు. తన పాదాలనే ఫణంగా పెట్టి భారీ పాదయాత్ర చేసారు. టీడీపీలో చంద్రబాబుతో పాటు తాను కూడా నాయకుడిని అని రుజువు చేసుకున్నారు. దాంతో పాటు ఎన్నికల వేళ లోకేష్ పార్టీ పైన బిగించిన పట్టుతో సీనియర్లకు అన్నీ అర్ధం అయ్యాయి. ఇక ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చూస్తే లోకేష్ ఎంతటి కీలక పాత్రధారో తెలిసింది. రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తే ఆయనకు స్వాగతం పలికే ఫ్లెక్సీల మీద చంద్రబాబుతో పాటు లోకేష్ బొమ్మ కూడా చూశాక ఇంకా ఎనీ డౌట్స్ అన్న ప్రశ్న కూడా వేయాలనిపించదేమో.

అంతేనా ప్రధాని సభలో చంద్రబాబుతో పాటుగా లోకేష్ కూడా ప్రసంగించారు. మరి ఆయన బాబు తర్వాత స్థానంలో కాకపోతే ఆ పొలిటికల్ స్పేస్ కానీ ప్రయారిటీ కానీ ఎందుకు వస్తుంది అని ఆలోచించేవారు ఉంటారు కదా. ఇక దావోస్ లో బాబు కంటే ఎక్కువగా లోకేష్ ఒక వెలుగు వెలిగారు. దానికి తోడు అన్నట్లుగా లోకేష్ డిప్యూటీ సీఎం అని ముఖ్యమంత్రి అని ఒక వైపు నినాదాలు ఉండనే ఉన్నాయి.

వీటి మధ్యలో మరోసారి సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు లోకేష్ గురించి ఏమన్నారో చూస్తే ఆశ్చర్యమేమీ ఉండదు కానీ భలే తమాషాగా అనిపిస్తుంది. టీడీపీలో చంద్రబాబు తరువాత స్థానం లోకేష్ దే అని తేల్చేశారు. ఇందులో ఎలాంటి వివాదమూ లేదని అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి 164 సీట్లను సాధించడంలో లోకేష్ పాత్ర చాలా కీలకమైనది అని కూడా చెప్పారు.

లోకేష్ 2017 నుంచి 2019 దాకా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నపుడు ఏపీ మొత్తం మీద 27 వేల కిలోమీటర్ల దాకా సిమెంట్ రోడ్లు వేయించారని, అలాగే ప్రతీ కరెంట్ స్తంభానికి లైట్లతో వెలుగులు తెచ్చారని కూడా కితాబు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి లోకేష్ కి ఇవ్వాలన్న డిమాండ్ల మీద అచ్చెన్నాయుడు స్పందిస్తూ అది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

మొత్తానికి అచ్చెన్నాయుడు లోకేష్ బాబే టీడీపీకి ఫ్యూచర్ అన్నారన్న మాట. ఈ విధంగా టీడీపీ సీనియర్ల మనసు గెలిచిన లోకేష్ కి ఇంతకంటే ఘన విజయం ఏమి ఉంటుంది అన్న మాట వినిపిస్తుంది. అదే సమయంలో 2021లో పార్టీ లేదు అని మాట్లాడిన వారే ఇపుడు ఆయనే పార్టీ ఫ్యూచర్ అంటున్నారంటే లోకేష్ బాబు నాలుగేళ్ళ పొలిటికల్ గ్రాఫ్ అదరహో అనాల్సిందేగా మరి.