చంద్రబాబు అరెస్ట్ అయితే ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు : నారా లోకేష్
ఇండియా టుడే ఎన్ క్లేవ్ లో మంత్రి నారా లోకేష్ ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
By: Tupaki Desk | 8 March 2025 9:06 PM ISTచంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఆయనకు మద్దతుగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో వేలాదిమంది ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని ఏపీ మంత్రి నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. మా మీద అంత ప్రేమ,ఆప్యాయతలను చూపించిన ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టమన్నారు. ఇండియా టుడే ఎన్ క్లేవ్ లో మంత్రి నారా లోకేష్ ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడి అరెస్టు సందర్భంలో, హైదరాబాద్‌లో 45,000 మంది ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అన్యాయమని భావించి, హైదరాబాద్ లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇది టీడీపీకి దక్కిన ప్రజాభిమానాన్ని తెలియజేస్తుందని లోకేష్ తెలిపారు.
కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే, ఏపీకి చంద్రబాబు గారు ఉన్నారు" అని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి ఓ గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయనే తగిన నాయకుడని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం టెక్నాలజీ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు అనుభవం, దూరదృష్టి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం. ప్రత్యేకంగా అమరావతి రాజధాని ప్రాజెక్టు, ఐటీ రంగంలో విజయాలు, విదేశీ పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాల్లో చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి ఎంతో లాభం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
- ఛాంపియన్స్ ట్రోఫీపై ఆశాభావం
మొన్న పాకిస్తాన్ మ్యాచ్ లో మిమ్మల్ని చూశామని.. తనను చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దుబాయ్ కు తీసుకెళ్లండని జర్నలిస్ట్ రాజ్ దీప్ సరదాగా కోరగా.. నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు లేకుంటే తీసుకెళ్లేవాడినని.. అయినా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం క్రికెట్‌లో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
నారా లోకేష్ ప్రసంగంలో ఆయన పార్టీ విధానాలు, ప్రజాభిమానాన్ని గెలుచుకోవడంలో చంద్రబాబుకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.. ప్రజాసేవలో అంకితభావంతో ముందుకు సాగుతామని ఆయన పునరుద్ఘాటించారు.