Begin typing your search above and press return to search.

ఫస్ట్ స్టెప్ సక్సెస్... అమెరికాలో లోకేష్ దూకుడు!

ఈ సందర్భంగా... లోకేష్ కు అక్కడి తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులూ ఘన స్వాగతం పలికారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 3:30 PM GMT
ఫస్ట్  స్టెప్  సక్సెస్... అమెరికాలో లోకేష్  దూకుడు!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా... లోకేష్ కు అక్కడి తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులూ ఘన స్వాగతం పలికారు.


ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకూ మంత్రి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వెళ్లిన వెంటనే మంత్రి నారా లోకేష్ పని మొదలుపెట్టేశారు.


అవును... ప్రస్తుతం అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలుచేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు సవివరంగా వివరించారు.

ఇదే సమయంలో... పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ఆ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వివరించారు. ప్రధానంగా.. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరికాన్ని నిర్ములించాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని.. ఈ మేరకు సరికొత్త పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్) విధానం తీసుకొచ్చారని.. దీనిద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్లు లోకేష్ వెల్లడించారు.

ఇదే క్రమంలో... పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి.. తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని శాన్ ఫ్రాన్సిస్కో లోని పారిశ్రామిక వేత్తలకు ఏపీ మంత్రి నారా లోకేష్ సవివరంగా వివరించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ విడియా వైఎస్ ప్రెసిడెంట్ రాము అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూట్రానిక్స్ ప్రెసిడెంట్ నాగేంద్ర రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సీఈఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సీఈవో అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండీ జిష్ణు భట్టాచార్య పాల్గొన్నారు.

వీరితో పాటు సిస్కో సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, సెల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, స్పాన్ ఐఓ సీఈవో ఆర్చ్ రావు, మిహిరా ఏఐ సీఈఓ రాజా కోడూరి, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, హిటాచీ వంటారా సీఈఓ ఆశిష్ భరత్, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి పాల్గొన్నారు.

అదేవిధంగా... వెస్ట్రన్ డిజిటల్ సీఈవో శేషు తిరుమల, ఈక్వేనిక్స్ గ్లోబల్ ఎండీ కేజే జోషి, త్రీడీ గ్లాస్ సొల్యూషన్స్ సీఈవో బాబు మండవ, పారిశ్రామిక వేత్తలు వంశీ బొప్పన, సంతీష్ మంత్రిప్రగడ, రాజీవ్ ప్రతాత్ప్, సతీష్ తాళ్లూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.

వీరందరికీ... ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలుచేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను లోకేష్ వివరించారు. దీంతో లోకేష్ అమెరికా పర్యటనలో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!