Begin typing your search above and press return to search.

ఇన్నేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఘాట్ గుర్తుకు వచ్చిందేంటి లోకేశ్?

ఎప్పుడూ లేనిది ఈసారి ఎన్టీఆర్ వర్థంతికి హాజరై.. నివాళులు అర్పించిన సందర్భంగా ఘాట్ లోపాల్ని ప్రస్తావిస్తూ.. సొంత నిధులతో మరమ్మత్తులు చేయాలని ఆదేశించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Jan 2025 2:00 AM GMT
ఇన్నేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఘాట్ గుర్తుకు వచ్చిందేంటి లోకేశ్?
X

ఆసక్తికర పరిణామానికి వేదికగా మారింది స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి.. తాతకు నివాళులు అర్పించిన నారా లోకేశ్.. ఈ సందర్భంగా ఘాట్ గోడలు.. పైకప్పు పెచ్చులు ఊడిపోవటం.. గార్డెన్ లో లైట్లు విరిగిపోయి ఉండటాన్ని గుర్తించిన ఆయన స్పందించటం తెలిసిందే. ఇక్కడ పాయింట్ ఇదేమీ కాదు. ఇప్పటికిప్పుడు.. ఎన్టీఆర్ ఘాట్ మొయింటెన్స్ సరిగా లేకపోవటం జరగలేదు. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎప్పుడూ లేనిది ఈసారి ఎన్టీఆర్ వర్థంతికి హాజరై.. నివాళులు అర్పించిన సందర్భంగా ఘాట్ లోపాల్ని ప్రస్తావిస్తూ.. సొంత నిధులతో మరమ్మత్తులు చేయాలని ఆదేశించటం తెలిసిందే.

ఇక్కడే ఒక ఆసక్తికర మెలికి ఉందని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ వర్థంతికి నివాళులు అర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్.. ఘాట్ ను కనీసం పూలతో అలంకరించకపోవటాన్ని గుర్తించి విపరీతంగా ఫీలయ్యారు. అప్పటికప్పుడు పూల మాలల్ని తెప్పించి అలంకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఘాట్ అలంకరణ బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించటమే కాదు.. అప్పటి నుంచి వర్థంతి.. జయంతి సందర్భంగా పూలతో అందంగా డెకరేట్ చేసే బాధ్యతను తీసుకున్నారు.

అప్పుడెప్పుడూ ఈ విషయాల్ని పట్టించుకోని ఏపీ మంత్రి కం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్.. వర్థంతి వేళ ఘాట్ కు రావటమే కాదు.. అక్కడ నిర్వహణ సరిగా లేకపోవటంపై అసంత్రప్తిని వ్యక్తం చేయటమే కాదు.. దీనికి సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉన్న హెచ్ఎండీ తీరును తప్పు పట్టారు. అంతేకాదు.. తన సొంత నిధులతో రిపేర్లు చేయాలని.. పూర్వ వైభవం వీలైనంత త్వరగా తీసుకురావాలని చెబుతున్నారు. ఘాట్ నిర్వహణను ఎన్టీఆర్ ట్రస్టుకు అప్పగించాలని పలుమార్లు తాము చేసిన వినతిని పాత ప్రభుత్వం స్పందించలేదన్నారు.

ఇక్కడ ప్రశ్న ఏమంటే.. ఇన్నేళ్లుగా ఈ అంశాన్ని ఓపెన్ గా చెప్పని లోకేశ్.. ఈసారి ఎందుకు ఓపెన్ అయినట్లు? ఎన్టీఆర్ ఘాట్ ను మరింత బాగా డెవలప్ చేయాలని ఇప్పుడు ముందుకు రావటం ఏమిటి? ఇంతకాలం వర్థంతి.. జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళలోనే లోకేశ్ ఓపెన్ కావటం.. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ మీద ఇప్పటివరకు కడుపులో దాచుకున్నదంతా లోకేశ్ వెళ్లగక్కారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం కీలక పరిణామాలకు వేదికగా నిలిచిందని చెప్పక తప్పదు. దీని పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.