Begin typing your search above and press return to search.

'ఆ ఒక్క నిర్ణయంతో లోకేష్ టచ్ చేశారు'.. నెటిజన్ల ప్రశంసలు!

వివరాళ్లోకి వెళ్తే.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నారా లోకేష్ ను గతంలో "పప్పు" అని సంబోధిస్తూ రకరకాల దుర్భాషలాడారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 5:45 AM GMT
ఆ ఒక్క నిర్ణయంతో లోకేష్  టచ్  చేశారు.. నెటిజన్ల ప్రశంసలు!
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతీకార రాజకీయాలే జరుగుతున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలు వేరు ప్రభుత్వంలో ఉండి చేసే పరిపాలన వేరని.. ఈ హోదాలో ఉన్నవారికి అన్ని పార్టీల వాళ్లూ సమానంగా చూడాలని అంటుంటారు. తాజాగా లోకేష్ ఇదే పని చేశారు. నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు.

అవును... ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతికార రాజకీయాలు పీక్స్ లో నడుస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ఏపీలో అయితే అవి మరింత స్థితికి చేరాయని అంటున్నారు. అయితే ఆ కామెంట్లకు పూర్తి భిన్నంగా అన్నట్లుగా లోకేష్ స్పందించారు. తనను దుర్భాషలడిన వ్యక్తికి ఊహించని సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు.

వివరాళ్లోకి వెళ్తే.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నారా లోకేష్ ను గతంలో "పప్పు" అని సంబోధిస్తూ రకరకాల దుర్భాషలాడారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో మరింత దారుణంగా ఎగతాళి చేశారు. ఈ సమయంలో లోకేష్ ఓ అభినందనీయమైన చర్యకు ఉపక్రమించారు.

అయితే యాదృచ్ఛికంగా సోషల్ మీడియాలో ఏ వినియోగదారుడు అయితే లోకేష్ ని దుర్భాషలాడారో... అతను తాజాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, సహాయం కావాలని రిక్వస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ను మరొక ట్విట్టర్ యూజర్ లోకేష్ ను ట్యాగ్ చేస్తూ పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యలో లోకేష్ స్పందించారు.

ఇందులో భాగంగా ఎక్స్ లో ఆ పోస్ట్ కు రిప్లై ఇచ్చిన లోకేష్... "మేము అతనిని జాగ్రత్తగా చూసుకుంటాము.. నా టీమ్ అక్కడకు చేరుకుంటుంది అమ్మా!" అని తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లోనే లోకేష్ టీమ్ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని అంటున్నారు.

దీంతో... లోకేష్ రియాక్షన్ పైనా, హుటాహుటిన తీసుకున్న నిర్ణయంపైనా నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. "టచ్ చేశారు సర్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.