లోకేష్ హామీలు.. జనం అనుమానాలు!
తాజాగా ఆయన తమ ప్రబుత్వం రాగానే మహిళలకుసాధికారత పెంచుతామన్నారు.
By: Tupaki Desk | 1 Dec 2023 6:43 AM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. ఆగిపోతుందని.. ఇక, ముందు కు సాగదని.. వైసీపీ నేతల నుంచి వచ్చిన విమర్శలను పక్కన పెడుతూ.. ఆయన యువగళం పాదయా త్రను తిరిగి ప్రారంభించారు. ఇది పార్టీలో జోష్‌ను పెంచింది. విమర్శకులు కూడా.. దీనిని అంగీకరిస్తు న్నారు. ఇక, ఇదేసమయంలో నారా లోకేష్ ఇస్తున్న హామీలు కూడా.. చర్చగామారాయి. తాజాగా ఆయన తమ ప్రబుత్వం రాగానే మహిళలకుసాధికారత పెంచుతామన్నారు.
ప్రతి కుటుంబానికీ 3 సిలిండెర్ల చొప్పున ఉచితంగా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు (ప్రైవేటు-ప్రభు త్వం) కల్పిస్తామని.. ఏటా క్యాలెండర్లు వేస్తామని.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని చెబుతూ..నిరుద్యోగులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇవన్నీ.. సాధారణంగా.. చెబుతున్నవ నే భావన ఉంది. కానీ, ఇక్కడే లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఇవన్నీ అమలు చేసేలా , చేయించేలా బాధ్యత తనే తీసుకుంటానన్నారు.
ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. నిజానికి మినీ మేనిఫెస్టోలోనే చాలా వరకు హామీలు ఇచ్చారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా కల్పించారు. దీనిపైనా సందేహాలు వస్తే.. వాటిని కూడా పరిష్కరిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించొచ్చన్నారు. ఇలా.. ప్రతిహామీకీ మినీ మేనిఫెస్టోలో పక్కా పరిష్కారం చూపించారు. అయితే.. ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి. నిజంగానే అమలు చేస్తారా? అనే డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ బాధ్యత తీసుకున్నారు.
తాము ఇచ్చిన ప్రతిహామీని అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. అయితే.. దీనిపైనా మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని వర్గాలు పాజిటివ్‌గానే తీసుకుంటుండగా.. మరికొన్ని వర్గాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. వచ్చే ప్రభుత్వంలో(ఒకవేళ టీడీపీ-జనసేన ఏర్పడితే) మీ పోస్టు ఏంటి? మీరు సీఎం అవుతారా? లేక డిప్యూటీ సీఎం అవుతారా? అనేది ప్రశ్న. అప్పుడు కదా.. మీ హామీలను నమ్మాలి? అనేది కొందరి వాదన. మరి దీనిపై నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారో చూడాలి. మొత్తానికి నారా లోకేష్ చెబుతున్న వాదనలు అయితే.. ప్రజల్లోకి బలంగానే చేరుతున్నాయనేది అర్థమవుతోందని టీడీపీ నాయకులు అంటున్నారు.