Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీ షేరింగ్ పై లోకేశ్ వ్యాఖ్యలు చేసుడా?

ఈ సందర్భంగా ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యక ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేశ్.. తాజాగా మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:53 AM GMT
సీఎం కుర్చీ షేరింగ్ పై లోకేశ్ వ్యాఖ్యలు చేసుడా?
X

కొన్ని విషయాల మీద ఎంత అవగాహన ఉన్నప్పటికీ.. సమయం సందర్భాన్ని చూసుకోకుండా మాట్లాడటం ఏ మాత్రం సరికాదన్నవిషయాన్ని నారా లోకేశ్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘంగా సాగిన పాదయాత్రను ఎట్టకేలకు పూర్తి చేశారు లోకేశ్. ఈ సందర్భంగా ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యక ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేశ్.. తాజాగా మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. అయితే.. ఉత్సాహంతోనో.. ఆత్మవిశ్వాసంతోనో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు జనసైనికులకుహర్ట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

గతంలో ఒక మీడియా సంస్థలో పని చేసి.. ఇప్పుడు యూట్యూబర్ గా మారిన ఒక జర్నలిస్టుకు ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు లోకేశ్. సాధారణంగా తన ఇంటర్వ్యూల్లో ఏదో ఒక సంచలనం ఉండేలా చూసుకోవటం సదరు ఇంటర్వ్యూ చేస పెద్ద మనిషికి ఉండే లక్షణం. అంతేకాదు..ఏదో ఒకటి చేసి.. చిన్నపాటి ట్విస్టుతో తన ప్రశ్నకు సమాధానం రాబట్టే క్రమంలో ఏదో ఒక సంచలనం దిశగా సీన్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందుకు అవసరమైతే ట్విస్టులను జత చేయటం కనిపిస్తుంది.

తాజా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించిన లోకేశ్..‘‘సీఎం కుర్చీని ఎవరితోనూ తాము షేర్ చేసుకోం’ అంటూ కుండబద్దలు కొట్టటం కనిపిస్తుంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైనా.. ఏపార్టీని ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నకు సమాధానాన్నివెతికే ప్రయత్నం చేశారు. సీట్ల షేరింగ్ అంశం ఖరారైనప్పటికీ పోటీ చేసే స్థానాలపై మరింత కసరత్తు అవసరమని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండుపార్టీలు కలిసి.. సీఎం కుర్చీని షేరింగ్ చేసుకుంటారా?అన్న లోకేశ్ ప్రశ్నకు ‘నో’ అని కుండబద్ధలు కొట్టేయటంతో పాటు.. గతంలో పవన్ ప్రస్తావించిన అంశాల్ని లోకేశ్ ప్రస్తావించటం కనిపిస్తుంది.

‘‘జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. మేం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు. అందులో మరో ఆలోచన లేదు. అనుభవం ఉన్న, సమర్థవంతమైన నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఎలాంటి సందిగ్ధం లేదు. నేనెప్పుడూ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. విధానపరంగా విబేధించాం తప్పితే.. వ్యక్తిగతంగా తమ మధ్య విబేధాలు ఎప్పుడూ లేవు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారు’’ అని చెప్పిన లోకేశ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఏమైనా.. సీఎం కుర్చీ షేరింగ్ మీద అడిగిన ప్రశ్నకు సమాధానాన్నినారా లోకేశ్ ఇచ్చే కన్నా.. ఇరు పార్టీలకు చెందిన పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే తప్పించి.. తనకు తానే ప్రకటన చేసేయటం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైనా పొత్తుతో ఉన్న పార్టీని చిన్నబుచ్చేలా మాట్లాటం.. హర్ట్ అయ్యేలా చేయటం ఏ మాత్రం మంచిది కాదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందరపడి కూసిన కోయిల మాదిరి.. లోకేశ్ మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు.