వైసీపీ ముందస్తుకు లోకేష్ కండిషన్లు
ఏపీ లో అన్ని హామీలు నెరవేర్చామని వైసీపీ అంటోంది కానీ వారు చాలా హామీలు చేయలేదు అని లోకేష్ గుర్తు చేశారు.
By: Tupaki Desk | 15 July 2023 11:23 AM GMTఏపీ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రచారం అయితే సాగుతోంది. ముందస్తు ఎన్నికలు అన్నది ఎవరు తీసుకొచ్చారో కానీ వైసీపీ మంత్రులు కీలక నేతలు అంతా ఖండిస్తున్నా కూడా అది ఆగకుండా అలా ముందుకు సాగిపోతూనే ఉంది. ఇక ముందస్తు ఎన్నికల ను మేము సిద్ధం అని ఎపుడూ చంద్రబాబు అంటారు
అయితే చంద్రబాబు కు కాస్తా భిన్నంగా లోకేష్ ముందస్తు ఎన్నికల విషయం లో స్పందించడం విశేషం. ఏపీ లో ముందస్తు ఎన్నికల కు వైసీపీ పెద్దలు వెళ్లాలంటే చాలా చేసి వెళ్లాల ని ఆయన అంటున్నారు ఏపీ లో అన్ని హామీలు నెరవేర్చామని వైసీపీ అంటోంది కానీ వారు చాలా హామీలు చేయలేదు అని లోకేష్ గుర్తు చేశారు.
పెన్షన్ వృద్ధుల కు మూడు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు కానీ ఇంతవరకూ అది చేయలేదని లోకేష్ విమర్శించారు. అలగే అమ్మవొడిని ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ వర్తింపచేస్తామని చెప్పారని ఆ హామీ కూడా అలాగే ఉందని గుర్తు చేశారు. అదే విధంగా సంపూర్ణ మద్య నిషేధం పేరు చెప్పే జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందని, ఇప్పటిదాకా ఆ ఊసే తలవడంలేదని ఆ హామీ కూడా తెర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే స్థానికులకే ఉద్యోగాలు అని అంటున్నారని, కానీ ఆచరణ లో లేదని, మరి స్థానికులకే డెబ్బై అయిదు శాతం ఉద్యోగాలు అన్నది ఏమైంది అని ఆయన నిలదీశారు. నెల్లూరులో తాను పాదయాత్ర చేస్తున్న వేళ చాలా మంది నాన్ లోకల్స్ కే అవకాశాలు తప్ప తమకు ఉపాధి లేదని తనతో చెప్పుకుని ఆవేదన చెందారని లోకేష్ అంటున్నారు.
అన్ని హామీలు మేము నెరవేర్చామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం కాదని ఆయన ఫైర్ అయ్యారు. తాను చెప్పినట్లుగా అనేక హామీలు పెండింగు లో ఉన్నాయని వీటికేమి సమాధానం చెబుతారని ఆయన అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అని వైసీపీ నేతలు రెడీ అయితే మాత్రం ముందు ఈ హామీల ను నెరవేర్చి అన్ని తాము చేశామని చెప్పిన మీదటనే ఎన్నికల కు వెళ్లాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా టీడీపీ మాత్రం ముందస్తు ఎన్నికల కు ఎపుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. రాజకీయ నాయకులు అన్నీ చేశామని చెబుతారని, అలా చెప్పడం సులువు అని, కానీ అమలు చేసి చూపించడమే కష్తమని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనంది వైసీపీ నేతల ఇష్టమని లోకెష్ చివరి గా మరో మాట అన్నారు. ఇవన్నీ చూసిన మీదట ఆలోచిస్తే లోకేష్ బాగానే వైసీపీ కి కండిషన్లు పెట్టారని అనిపించకమానదు మరి దీనికి వైసీపీ నుంచి వచ్చే సమాధానం ఏమిటో చూడాల్సి ఉంది.